తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా క్షేత్రస్థాయిలో బలపడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారు. ఈమేరకు గులాబీ బాస్ ఆదేశాలతో నేతలంతా ఆయా జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వాలను రికార్డు స్థాయిలో నమోదు చేయించి సంస్థాగత ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రామ, పట్టణ, మండల కమిటీల ఎంపికను టీఆర్ఎస్ అధిష్టానం దాదాపు పూర్తి చేసింది. ఇక జిల్లా కమిటీలు సైతం సెప్టెంబర్ లేదా అక్టోబర్…
యాదాద్రి నిర్మాణం పై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి నిర్మాణం నేపథ్యంలో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.. తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్ పాలన సాగుతోందన్నారు స్వరూపానందేంద్ర. రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి అని… సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని సీఎం కేసీఆర్ మహా క్షేత్రం గా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ మైలురాళ్లలో తెలంగాణ సాధనతో పాటు…
నెల 27న హన్మకొండ జిల్లా పెంచికల్ పేటలో జరగాల్సిన సీఎం కేసీఆర్ అభినందన సభకు కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వులు అడ్డంకిగా మారింది. ఉప ఎన్నికతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న జిల్లాలు, చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ఏ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదని సీఈసీ ఆదేశించడంతో…సభ రద్దయినట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది. దేశంలోని పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నికల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. బై…
మంత్రి అంటే.. ఆయన శాఖకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఉంటుందని అనుకుంటాం. బాధ్యతలు చేపట్టిన కొత్తలో తెలియకపోయినా.. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు కొందరు. మరి.. ఆ ప్రయత్నం చేయలేదో ఏమో.. సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నకు గుడ్లు తేలేశారట మంత్రి పువ్వాడ అజయ్. ఆ సందర్భంగా పేలిన డైలాగులపైనే ఇప్పుడు చర్చ. ఆర్టీసీ బస్సుల లెక్కలు అడిగితే బిక్కముఖం వేసిన మంత్రి అజయ్? టీఆర్‌ఎస్ ప్లీనరీ.. తెలంగాణ విజయ గర్జన సభపై మాట్లాడేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో…
రావణ రాజ్యం పోవాలి.. రాముడి రాజ్యం రావాలి అంటూ పిలుపునిచ్చారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్న ఆమె.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ప్రచారం కంటే.. ప్రజల బీజేపీ ప్రచారం ఎక్కువగా ఉందన్నారు.. ప్రజలు బీజేపీ పార్టీ ప్రచారాన్ని భుజాన వేసుకున్నారన్న రాములమ్మ.. ఈటల రాజేందర్ ఆరు సార్లు గెలిచాడంటే ప్రజల మద్దతు ఎలా…
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్.ఆర్.ఆర్(RRR) సినిమా గురించి ప్రస్తావించారు. నవంబర్ 2న RRR సినిమా స్పెషల్ షో ప్రగతి భవన్ ముందు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఆరోజు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం రానుందని.. ఆరోజు బాక్స్ బద్దలు అవుతుందన్నారు. అయితే బండి సంజయ్ RRR సినిమా అంటే రాజమౌళి సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు బండి సంజయ్ RRR…
తెలంగాణలో మద్యం షాపులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతకాదు.. నష్టాల్లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఒక్క మద్యం వ్యాపారమేననే ప్రచారం ఉంది. మద్యం షాపు కోసం ఎంత పెట్టుబడి పెట్టినా అంతకు పదిరెట్లు లాభం వస్తుందనే నమ్మకం వ్యాపారుల్లో ఉంది. దీంతో మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులంతా క్యూ కడుతుంటారు. మద్యం షాపుల టెండర్లలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి మద్యం షాపు దక్కిందా? ఇక తమ దశ తిరిగినట్లేనని భావించే…
తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర రావు గారి పిలుపు మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఆరు కేజీల బంగారం సమర్పిస్తున్నట్టు బుధవారం నాడు ప్రకటించింది. ఈ సందర్భంగా MEIL డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం…
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలని… గంజాయిపై యుద్ధం ప్రకటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణా మరియు వాటి నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. గంజాయి అక్రమ సాగు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని…పరిస్థితి తీవ్రం కాకముందే అరికట్టాలని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని… తెలిసీ తెలియక దీని బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగం…
సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. దళిత బంధుపై ఎవరి నిజాయితీ ఏందో యదాద్రిలో తేల్చుకుందాం.. దమ్ముంటే అక్కడికి రావాలని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దళిత బంధు ఆపాలని బీజేపీ ఎక్కడా లేఖలు ఇవ్వలేదన్నారు. ఇవాళ హుజురాబాద్ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస ఇచ్చే 20 వేలు తీసుకుని.. ఓటు మాత్రం బీజేపీకి వేయాలని కోరారు.…