ప్రభుత్వం.. పార్టీల మధ్య పోరాటం కాదు.. ఇది ప్రభుత్వాల మధ్య యుద్ధం.. రైతు పండించిన పంట కల్లాలు, మార్కెట్ యార్డ్‌లు, చివరకు రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంది.. కానీ, గిట్టుబాటు ధర చెల్లించి రైతు నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి… పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. మొత్తం వడ్ల చుట్టే తిరుగుతోంది రాజకీయం… వడ్ల పండించాలని ఒకరు, పండించవద్దని మరొకరు.. ఇలా రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కేంద్రంలో…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.. అభ్యర్థుల వేటలో పడిపోయారు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్.. మరోవైపు ఎలాగైనా ఓ సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసే ఆశావహులు లేకపోలేదు.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌కు ఓ విజ్ఞప్తి చేసింది.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు.. ప్రైవేట్ పాఠశాలలో చదివే 55 శాతం విధ్యార్థుల కోరకు మరియు…
మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… ఒక్క సారిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్… నిర్వహించిన ఓ శుభకార్యంలో సందడి చేశారు. అదేంటి… టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి ఈటల రాజేందర్ వెళ్లడమేంటని అనుకుంటున్నారా ? అవును ఇది నిజమే. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ గారి కుమార్తె వివాహ వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈటల…
సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కేంద్ర శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. కృష్ణ జలాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ఈ అంశంపై కేసీఆర్ సర్కార్ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నందున మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పామన్నారు. దీంతో రెండు రోజుల్లో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని తెలిపి.. 8 నెలలకు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. పిటిషన్…
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు…
తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి… ఆ పార్టీ నాయకులు ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయబోతున్నారు. కేంద్రం ధాన్యం కొనాలని అధికార ప్రభుత్వ నాయకులు ధర్నా కి దిగుతున్నారు అని వీ.నుమంతరావు చెప్పారు. ధర్నా చౌక ఎత్తేశారు కదా… ఇప్పుడు అదే ధర్నా చౌక వద్ద దర్నా కి దిగుతున్నారు. ధర్నా చౌక ఎత్తేస్తే నెను కోర్ట్ లో పిటిషన్ వేశాను. రైతుల పట్ల కేసీఆర్ కి చిత్త శుద్ధి ఉంటే..నల్ల చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చెయ్…
దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీజేపీ రైతు అంశంపై కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోందని… నిన్నటి వరకు 3550 కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని…. కొన్న పంటలకు డబ్బులు రైతులకు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు సోయి- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని.. కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ పార్టీ రాష్ట్ర…
ఎమ్మెల్యే కోటాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎంపిక చేసే ఆ ఆరుగురు ఎమ్మెల్సీలు ఏవిట్లు? ఆరు సీట్లలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయి? పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. చట్టసభల్లో కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తామని గతంలో సీఎం కేసీఆర్ మాటిచ్చారు. మరి ఇప్పుడా మాట ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా? లేదా? అనే ఉత్కంఠ మొదలైంది.ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. శాసనమండలికి ఎన్నిక కాబోతున్న ఆరుగురు ఎమ్మెల్సీలు ఎవరు?…
మద్యం షాపుల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించింది.. అయితే, మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా.. హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది.. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్న తన పిటిషన్‌లో పేర్కొన్నారు పిటిషనర్.. అయితే, ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ…
ఖాళీ అయినవి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు. కానీ పదవి ఆశిస్తోంది పదులు సంఖ్యలో. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ ఎవరికి అవకాశం ఇవ్వనుంది ? ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోనుంది.? తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఉండడంతో … ఆరు ఎమ్మెల్సీ స్థానాలు అధికార టీఆర్ఎస్ పార్టీకే దక్కుతాయి. దీంతో అధికార పార్టీలోని ఆశవాహులు ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు గట్టి…