దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం లో తెలంగాణ ప్రస్తావించిన అంశాలను వివరించారు హోంమంత్రి మహమూద్ అలీ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకం అనుమతులు. జనవరి 15 లోపు డీపీఆర్ లు కేఆర్ఎంబీకి సమర్పించాలని..డీపీఆర్ ల ఆధారంగా సెంటర్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజీవ్ గాంధి సంగంబండ బ్యారేజ్ ద్వారా కర్ణాటక లో మునిగి పోనున్న ప్రాంతాల పై తెలంగాణ, కర్ణాటక ఉమ్మడి గా సర్వే నిర్వహించాలని నిర్ణయం. ఏపీకి తెలంగాణ రూ.6015…
తెలంగాణలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ తమ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌కు సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై చర్చించి ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటా లో ఒకటి…
నరకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది బోధన్ రోడ్డు. ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నవారు ఎందరో. గత రెండున్నరేళ్ళుగా బోధన, బాన్స్ వాడ రోడ్డుని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో మరింతగా గుంతలు పడ్డాయి. గర్భిణీలు ఈ రోడ్డుపై వెళ్ళి ఆస్పత్రికి చేరాలంటే భయపడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వాటి అమలును మరిచిపోతున్నారు. దీంతో రోడ్డు పై ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజూ వందలాదిమంది…
దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చాడు. నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఒట్టి మాటలు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్ళల్లో మట్టికొట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నాడు. ధరణి పోర్టల్ వలన సొంత భూముల మీద హక్కులు కోల్పోతున్నాం. సమాజంలో అత్యంత…
తిరుపతిలో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. సౌత్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్‌గా ఉండగా… ఏపీ ముఖ్యమంత్రి YS జగన్… వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ఆతిథ్య నిర్వహణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఇవాళ తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు.. ఏపీ, తమిళనాడు,…
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఏపీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల హోంమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు…
తెలంగాణ కు అన్యాయం చేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో రైతు బాయిల్డ్ రైస్ పండిస్తారా… ఆ రైస్ ను రైస్ మిల్లర్లు కొని రా రైస్, బాయిల్డ్ రైస్ చేస్తారు. గత మూడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వాలతోబాయిల్డ్ రైస్ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ధాన్యం కొనుగోలు కోసం నిధులు రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్రం ఇస్తుంది… 8.5 శాతం వడ్డీ కూడా ఇస్తుంది. ఈ ఏడాది 40…
దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సమావేశానికి తిరుపతి నగరం సిద్ధమయింది. ఈ నెల 14వ తేదీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా ఈనెల 13వ తేదీ రాత్రి 7.40 నిమిషాలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడినుండి 7:45 నిమిషాలకు బయలుదేరి రాత్రి 8.05 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఈనెల 14వ తేదీ ఉదయం…
తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఓటమి తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారని, కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్‌ఎస్ నేతలు బజార్ రౌడీల్లా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీని బదనాం చేయడం కోసం తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ కు లేదు. రైతుల మీద ప్రేమ…
దళిత బహుజన ప్రజాజీవితాల్లో గుణాత్మక అభివృద్ధికోసం తన జీవితాంతం కృషిచేసిన ఐఏఎస్ మాజీ అధికారి బి.దానం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా డాక్టర్ అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడుగా పనిచేశారు దానం. దళిత బహుజన మైనారిటీ వర్గాలకు దానం విశేష సేవలందించారని సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.