దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీజేపీ రైతు అంశంపై కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోందని… నిన్నటి వరకు 3550 కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని…. కొన్న పంటలకు డబ్బులు రైతులకు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు సోయి- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని.. కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం దురదృష్టకరమని బండి సంజయ్ కి చురకలు అంటించారు.బీజేపీ నాయకులు కేంద్రప్రభుత్వం కార్యాలయాలు- ఢిల్లీలో ధర్నాలు చెయ్యాలన్నారు. ధర్నాలు చేసేది మారువేషంలో బీజేపీ నాయకులేనని ఫైర్ అయ్యారు. 2019- 20 లో 1కోటి 19లక్షల మెట్రిక్ టన్నులు- గత ఏడాది 1కోటి 40లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందన్నారు. ఏ రాష్టంలోనైనా మార్కెట్ల దగ్గరకు రైతులు వెళ్తారు- కానీ తెలంగాణలో మాత్రం మార్కెట్ నే రైతుల దగ్గరకు తీసుకుపోయామని గుర్తు చేశారు పల్లా.