కేసీఆర్‌ను కలిసిన తాతా మధుసూధన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధుసూధన్ రావు విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఎమ్మెల్సీ తాత మధుకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు ఉమ్మడిగా కృషి చేసిన ప్రజా ప్రతినిధులందరినీ కేసీఆర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రావతి, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!