తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం పెంచిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్. బీసీ, ఈబీసీ, డీఎన్ టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని పెంచడంపట్ల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కే. కిశోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఓబీసీ, ఈబీసీ స్కాలర్ షిప్స్ కి విద్యార్థుల కుటుంబ ఆదాయ పరిమితి పెంచింది. వార్షిక ఆదాయం పరిమితి రెండున్నర లక్షలకు పెంచారు. పోస్ట్…
తెలంగాణలో వరిధాన్యం సమస్య వెనుక బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర వుందని మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ మంత్రులు కొత్త డ్రామా ఆడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి బీజేపీ-టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు వెనుక బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ కుట్ర వుందని ఆరోపించారు జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతేనే సమస్య పరిష్కారం కాలేదు. మంత్రులవల్ల ఏం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని…
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.కేసీఆర్ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. మా పిల్లలు తినే…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అంతేకాకుండా మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోలీసులపై విమర్శలు చేశారు. మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే శవయాత్రలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, పోలీసులా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలా అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ…
క్రైస్తవులకు పర్వదినమైన క్రిస్మస్‌ను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్ వైపుకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం, బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించబడదని, నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుండి ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. ఆ…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొనడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేడు టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నాయి. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే నిరసనల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణలో కేంద్ర తీరుపై ఊరురా టీఆర్ఎస్…
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. రేపు చావుడప్పుల పేరిట బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిదన్నారు. పరిపాలన చేతనవుతాలేదని ఒప్పుకొని అస్త్రసన్యాసం చేసి ముగ్గురం ఉన్నాం మాకు ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో రెండు సంవత్సరాలు నీ కంటే గొప్పగా పాలిస్తామన్నారు. ఇప్పటికైతే చేతనైతే…
టీఆర్ ఎస్ ప్రభుత్వం రైతు హంతక ప్రభుత్వమని వైఎస్ షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని…సర్కారు తరఫున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిపడ్డారు. రైతుల పాలిట కేసీఆర్…
సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి, మరో మహాత్ముడు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పాలకుర్తి మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర వైఖరి దారుణంగా ఉందని మండిపడ్డారు. బీజేపీ పార్టీకి, నాయకులకు సిగ్గు ఉండాలని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర నాయకులది ఒక వైఖరి, రాష్ట్ర నాయకులది…
సీఎం కేసీఆర్ పై మారోమారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి.. బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయాలనడం దారుణమన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎవరూ కూడా సీఎం కేసీఆర్ చెప్పినట్టు చేయరని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీని అణచి వేసేందుకు మమతా బెనర్జీ అమలు చేసిన ఫార్ములా ఇక్కడ అమలు చేయాలని కేసీఆర్ అనుకుంటునారని… కానీ ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ అని…