టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో వున్నారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన తిరిగి రాని లోకాలకు చేరారు. ఆయన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఆయన అందరికీ చేయి ఊపుతూ కనిపించారు.
ఫరీదుద్దీన్ అకాల మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫరీదుద్దీన్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో 2004లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఫరీదుద్దీన్.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు.2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జహీరాబాద్ లో ఇవాళ జరిగే మాజీ మంత్రి మహమ్మద్ ఫరిదుద్దీన్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,మంత్రులు, ఎమ్మెల్యే లు, నాయకులు,