BRS Manifesto Live updates:తెలంగాణ భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
BRS Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ భవన్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు.
Ponguleti: ఆట మొదలైంది ఇప్పుడు.. కబ్జాలన్నీ బయటకు తీస్తామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఎల్లా పాటు ప్రజలకోసం పని చేశారని అన్నారు.
తెలంగాణలో మళ్లీ విజయం మనదేనని సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఇప్పటికే 115 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను గులాబీ బాస్ ప్రకటించారు.
మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది అని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల టైంలో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ నేతలకు ఫెస్ వ్యాల్యూ లేదని.. సీఎం కేసీఆర్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు.. కేసీఆర్ పులి అంటూ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
CM KCR Publci Meeting: బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైంది. తుది మెరుగులు దిద్దారు. హ్యాట్రిక్ విజయాలే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు గులాబీ బాస్. ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేయనుండగా..
చిక్కడపల్లిలో నిన్న ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ప్రవళిక సూసైడ్ చేసుకోవడం దారుణమన్నారు. ప్రవళిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయని.., మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారని వాళ్ళ అమ్మ నాన్న తో ఫోన్ లో బాధపడిందని అన్నారు. ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం వచ్చారని బండి సంజయ్ తెలిపారు. లక్ష్మణ్, భానుప్రకాష్ వాస్తవాలను…
Minister KTR: మంత్రి కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాలను స్వయంగా ఇంటికి వెళ్లి కలిసారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.