Minister KTR: మంత్రి కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాలను స్వయంగా ఇంటికి వెళ్లి కలిసారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎల్‌లోకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేరునున్ననట్లు క్లారిటీ ఇచ్చారు. ఈనెల 16న సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పొన్నాల పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. పొన్నాలకు పార్టీలోకి రావాలని ఆహ్వానించామని అన్నారు. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.ఆయనకు గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 16న జరిగే కేసీఆర్ సభలో ఆయన పార్టీలో చేరుతారని మంత్రి కేటీఆర్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో పొన్నాల బీఆర్ఎస్ కండువాకప్పుకోవడం ఖాయమైంది.. దీంతో బీఆర్ఎస్ కు బలమే అని చెప్పాలి.
అయితే పొన్నాల కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నాలపై ఫైర్ అవుతున్నారు. 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు వీడటం ఏంటని పొన్నాల పై మండిపడుతున్నారు. అయితే ఇటు కాంగ్రెస్, అటు పొన్నాల విమర్శనస్రతాలు చోటుచేసుకుంటున్నా పరిణామంలో మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లడం చర్చకు దారితీసింది. అయితే పొన్నాల నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు పంపారు. బాధతో పార్టీ కి రాజీనామా చేస్తున్నానని అంటూ ఖర్గేకు లేఖలో తెలిపిన విషయం తెలిసిందే.. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందని అన్నారు. కానీ నన్ను రాజీనామా చేయించి బలి పశువుని చేసింది పార్టీ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2018 లో కూడా పార్టీ ఒడిపోయిందని, కానీ అప్పటి నాయకులను మాత్రం రాజీనామా చేయాలని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Mrunal Takur : అయ్యో సీతకు ఎంత కష్టం వచ్చిందో.. ఆ సమస్యతో భాధ పడుతున్న మృణాల్..