CM KCR Publci Meeting: నేడు హుస్నాబాద్‌లో సీఎం బహిరంగ సభ.. అక్కడి నుంచి ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Publci Meeting: బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైంది. తుది మెరుగులు దిద్దారు. హ్యాట్రిక్ విజయాలే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు గులాబీ బాస్. ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేయనుండగా.. అందులో కీలక హామీలను పొందుపరిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. గత పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చారు. సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిపుణులు, ఆర్థికవేత్తలు, సామాజిక వేత్తల అభిప్రాయాలు తెలుసుకుని మేనిఫెస్టోను ఖరారు చేసినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలు, ఇతర పార్టీల ఎన్నికల హామీలు, అమలు తీరును కూడా సీఎం కేసీఆర్ పరిశీలించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం సాయంత్రం హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల ప్రచార సభలో కేసీఅర్ పాల్గొననున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు పార్టీ సీనియర్ నేతలందరికీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించే బాధ్యతను అప్పగించారు. సభ ఏర్పాట్లను సీనియర్ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పర్యవేక్షించారు. తన నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని పున:ప్రారంభించినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ, సభకు లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. సభ సజావుగా సాగేందుకు పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత భారీ బలగాలను మోహరించి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్టోబరు 16న జనగాం, భోంగీర్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, 17, 18 తేదీల్లో సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అలాగే టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే..
Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు..
Also Read
తాజావార్తలు
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!