సీఎం కేసీఆర్‌పై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడున్నది? కమ్యూనిస్టులు ఎక్కడున్నరు? మమ్ముల్ని బంగాళా ఖాతంలో కలుపుతానంటవా? నీ తరం కాదు.. నీ అబ్బ తరం కాదు అంటూ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా మేం గోల్ మాల్ గోవిందలమా?…… ప్రపంచ గోల్ మాల్ గోవిందాలకు అధ్యక్షుడివి నువ్వే… గోల్డ్ మెడల్ నీదే అని అన్నారు. అబద్దాలాడేటోళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సి వస్తే అంతకుమించి పురస్కార్ నీకే ఇవ్వాలన్నారు.
కానీ ఇవేవీ నువ్వు చేయవ్… బీజేపీ మీద నింద వేయడానికి రెడీగా ఉంటావ్… మమ్మల్ని మతపిచ్చి గాళ్లంటవా? ఎస్.. మేం హిందూ ధర్మం కోసం ప్రాణమిచ్చేంత మతపిచ్చిగాళ్లమే అని ఆయన అన్నారు. నువ్వు ఓట్ల కోసం హిందూ వేషం వేస్తవ్? సీఎం సీటు కోసం మంత్రాలు, తంత్రాలు చేస్తవ్. నీ ఫాంహౌజ్ లో క్షుద్ర పూజలు చేస్తవ్ అంటూ ధ్వజమెత్తారు. మళ్లా రజకార్లను తలమీద పెట్టుకుని ఊరేగుతవ్? అంటూ బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.