మహారాష్ట్ర రాయ్‌చూర్ నియోజకవర్గానికి చెందిన మీ బీజేపీ ఎమ్మెల్యేనే మా నియోజకవర్గాన్ని తెలంగాణ కలపంటున్నారని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మాకు కావాలంటున్నారని టీఆర్‌ఎస్ నేతలు సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా రాయ్‌చూర్ ఎమ్మెల్యే శివ్‌రాజ్ పాటిల్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. నేను ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడిన మాటలను టీఆర్ఎస్ వాళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా నా నియోజకవర్గంకు ఎక్కువ పనులు, నిధులు మంజూరు కోసమే…
నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు లేవు, కరెంట్ లేదు.. చాలా దుర్భర పరిస్థితి లు ఉండే.. అల్లా, భగవంతుని దయ వల్ల మీ సహకారం వల్ల అధిగమించామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దేశం అంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని, దేశ వ్యాప్తంగా మైనారిటీ గురుకుల…
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. శుక్రవారం నగరంలో జరిగిన క్రెడాయ్ సమావేశంలో మంత్రి కేటీఅర్ మాట్లాడుతూ.. ఆంధ్రలో ఉన్న తన మిత్రుడు తెలంగాణ వారిని బస్సులో ఆంధ్రకు తీసుకొని వచ్చి, అక్కడ రోడ్లు, విద్యుత్ సరఫరా ఎంత అధ్వానంగా ఉందో చూపించాలని కోరినట్లు మంత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యానించడంపై డీకే అరుణ…
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిరంతరం 24/7 అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హోదాలు, విధులు వేరైనా అందరం ప్రజలకు సేవకులం అని, వారికి మంచి వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాక మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. అవసరం లేకున్నా గర్భిణులకు…
నల్గొండలో నేడు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నల్గొండ టౌన్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నార్కట్ పల్లిలో చిరుమర్తి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. గతంలో ఆదేశించిన మేరకు…
మరోసారి బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. నిన్న టీఆర్‌ఎస్ పార్టీ 21వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో 13 కీలక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తీర్మానాలపై బీజేపీ నేతల నుంచి సమాధానం లేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు, నవోదయ విద్యాలయాలలతో పాటు ఏ ఒక్క అంశంపై బీజేపీ నేతల వైపు నుంచి సమాధానం…
నిన్న టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్లీనరీలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అబద్దాలు, అభూత కల్పనలు వెల్లడించారన్నారు. పూనకo వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, బీజేపీ అంటే భయపడుతున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను ఏం ఉద్ధరించారని, పౌరుడిగా ఫ్రoట్ పెట్టొచ్చు, టెంట్ వేసుకోవచ్చునన్నారు. రాజ్యంగం ప్రకారం ఉన్నత పదవుల్లోకి రావచ్చునని ఆయన అన్నారు. గుణాత్మక పరిపాలన అంటే కల్వకుంట్ల పాలనా? గుణాత్మక పాలన అంటే ఏ ఎండకు ఆ…
తెలంగాణ గిరిజనులకు జనాభా ప్రాతిపదికన పెంచాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అందుకు తగిన విధంగా 12 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఆరోజు రాష్ట్ర ప్రభుత్వం తేల్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే తెలంగాణలో 7 సంవత్సరాలుగా విద్య, ఉద్యోగాల్లో గిరిజనులు అణిచివేతకి గురవుతున్నారు ఆయన ఆరోపించారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు తెచ్చి పోడు భూములకు హక్కులు కల్పించిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని, రిజర్వేషన్లు…
ఎర్రబెల్లి, గంగుల, తలసాని, దానం లాంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులు కేసీఆర్ పక్కన చేరారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. అలాంటి వాళ్ళను కేసీఆర్‌ను పోగుడతున్నరని, 8 ఏండ్లుకు నోటిఫికేషన్లు నిన్న వచ్చాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంకు అప్పులు… కేసీఆర్ గొప్పలు.. జనంకు తిప్పలు అన్నట్టు మారింది పరిస్థితి అంటూ ఆయన విమర్శించారు. ఉద్యమ పార్టీకి వెయ్యి కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని, 800 కోట్ల నగదు ఎవడబ్బ సొమ్మని,…
టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. కేవలం బీజేపీని తిట్టడానికే ఆయన టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించారన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టే కేసీఆర్ బీజేపీని తిట్టడానికి ఈ సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. సాధారణంగా ప్లీనరీలో పార్టీ వ్యవహారాలు, సంస్థాగత ఏర్పాట్లపై చర్చిస్తారని.. కానీ టీఆర్ఎస్ ప్లీనరీ దీనికి విరుద్ధంగా జరిగిందని బండి సంజయ్ విమర్శించారు. 33 రకాల…