CM KCR : నల్గొండ టౌన్ అభివృద్ధిపై సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండలో నేడు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నల్గొండ టౌన్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నార్కట్ పల్లిలో చిరుమర్తి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు. గతంలో ఆదేశించిన మేరకు పనులు ఎంతవరకు వచ్చాయని సీఎం ఆరా తీశారు.
నల్లగొండ టౌన్‌లో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో ‘నల్లగొండ కళాభారతి ‘ సాంస్కృతిక కేంద్రాన్ని 2000 మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలని అన్నారు. పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ ను పచ్చదనంతో సుందరీకరించాలన్నారు. నల్లగొండ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్టుల నుంచి డిజైన్ లు తెప్పించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
Also Read
తాజావార్తలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!