CM KCR At Tirumalagiri: ఆనాడు గోదావరి జలాల కోసం పోరాటాలు చేసిన గడ్డ తుంగతుర్తి అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తుంగతుర్తి సస్యశ్యామలంగా మారింది… కారణం కాళేశ్వరమని సీఎం వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టు నీటిని కూడా త్వరలోనే అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బునాదిగాని కాలువ వెడల్పు చేసి త్వరలో పూర్తి చేవి సాగు నీరు అందిస్తామని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సమర శంఖారావం సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
Also Read: Minister Harish Rao: డీకే శివకుమార్‌కు మంత్రి హరీశ్ థ్యాంక్స్.. డీకే నిజాలే చెప్పారు!
కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని.. అధికారంలోకి వచ్చి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఊరికే ఇవ్వలేదని.. అనేక మంది బలిదానాలు చేస్తే తెలంగాణ ఇచ్చారని కేసీఆర్ అన్నారు. యూపీలో అన్నానికి గతి లేదు.. అక్కడి నుంచి తెలంగాణకు బతకడానికి వస్తున్నారు.. కానీ ఆ ముఖ్యమంత్రి మనలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. మనం 24గంటల విద్యుత్ ఇస్తుంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం అని గొప్పలు చెప్తుండని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమని జేఏసీ అంటే.. కాంగ్రెస్, బీజేపీ, మరికొన్ని పార్టీలు కనీసం ముందుకు రాలేదన్నారు. దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Also Read: Telangana elections: టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు .. మదన్ మోహన్
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..” తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వలసలు, ఆత్మహత్యలు, హత్యలు నిత్యకృత్యంగా ఉండేవి. కులవృత్తులకు జీవం పోసాము. తుంగతుర్తి నుండి కిశోర్‌ను లక్ష మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తాం. అధికారం లేక కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తుంది. ధరణి రైతులకు శ్రీరామ రక్ష. ధరణి లేకపోతే దోపిడీ రాజ్యం వస్తుంది. రైతు బంధు వద్దన్న కాంగ్రెస్‌ను ఓడించాలి. 3 గంటల విద్యుత్ చాలు అంటున్న పీసీసీ అధ్యక్షుడికి బుద్ధి చెప్పాలి. ఉద్యమకారులను కేసుల పాలు చేసిన ఘనత కాంగ్రెస్‌దే.” అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.