మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కుల నీరు పోతుందని ఆయన అన్నారు. తెల్లారే సరికి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.…
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా…
బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. శనివారం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని..నేను టీఆర్ఎస్ పార్టీలో చేరింది గజ్వేల్ నియోజకవర్గంలోనే అని.. గజ్వేల్ పై ప్రత్యేక దృష్టి పెట్టానని.. బెంగాల్ లో సువేందు అధికారి, మమతా బెనర్జీని ఓడించినట్లే కేసీఆర్ ని ఇక్కడ నుంచి ఓడిస్తానని అని కామెంట్స్ చేశారు. Read…
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్డీఆర్ ఎఫ్, రెస్క్యూ టీం లను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…
రాజ్యసభ ఎంపీగా కే. లక్ష్మణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగానే కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్ష్ పాండేను కలిశారు. వారితో తాను తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్ అసోసియేషన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాల వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని…
రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కే. లక్ష్మణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మణ్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, ఎంఐఎంకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. టీఆర్ఎస్‌లో వెన్నుపోటు పొడిచేందుకు కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, ఈ కట్టప్పల…