ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయానికి వచ్చింది.. ఆ కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి కె. తారక రామారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు
ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీఆర్ఎప్ ప్రభుత్వంపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని, సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలుద్దామంటే, ఆయన సమయం ఇవ్వడం లేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందన రావట్లేదని పేర్కొన్నారు. భూ సమస్యతో రైతులు చనిపోతున్నారని, హత్యలు చోటు చేసుకుంటున్నాయని…
తెలంగాణ సీఎంకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. తన కుటుంబాన్ని , తనకు హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. కాగా.. అందుకోసమే హైదరాబాద్ ఎమ్మార్ బౌల్డర్ హిల్స్‌లోని తన నివాసం సమీపంలో పదే పదే రెక్కీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే.. జులై 4న తన ఇంటి సమీపంలోని కొందరు రెక్కీ నిర్వహిస్తుండగా.. అందులో ఒకరిని సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని ప్రశ్నిస్తే ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన బాషా అని చెప్పాడని రఘురామ…
తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్ -2021లో 86వ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) విద్యార్థి కాసర్ల రాజును మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అభినందించారు. రాజు స్ఫూర్తితో కళాశాల నుంచి మరింతమంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. జనగాం జిల్లా సూరారం గ్రామంలో కాసర్ల రాజు చెందినవాడు. అతను గత సంవత్సరం బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేసాడు. ప్రస్తుతం అతను ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్…
భూసమస్యల పరిష్కారంపై మరోసారి దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం.. వాటి పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కె. చంద్రశేఖర్ రావు.
సీజన్ మారిపోయింది.. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. ఏది వైరస్.. ఏది సీజనల్ అనే అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. ఈ తరుణంలో సీజనల్ వ్యాధులపై మూడంచెల వ్యూహం అవలంభించాలని అధికారులకు సూచించారు మంత్రి హరీష్‌రావు.. సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించిన హరీష్‌రావు.. ప్రజల్లో అవగాహన, పరీక్షలు చేయడం, చికిత్స అందించడం వ్యూహంగా సాగాలన్నారు.. అవసరం అయిన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.. స్కూల్స్, హాస్టల్స్ లో పారిశుద్ధ్యం, భోజనం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి గురించి ముందే తెలుస్తుండడంతో టీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టిన వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించామని తెలిపారు. అయితే..రానున్న కాలంలో పార్టీలో పెద్దఎత్తున చేరికలుంటాయని, ఆ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. విష్ణువర్ధన్ రెడ్డి తనను కూడా లంచ్ కు ఆహ్వానించారని, మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. కాగా..…
ప్రధాని మోడిప్రసంగంపై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అమ్యారు. వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ వస్తుంది.. కానీ అది కేసీఆర్ నేతృత్వంలో వస్తుందని పేర్కొన్నారు. మోడీ మాటల్లో అన్ని అబద్ధాలే అని మండిపడ్డారు. వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్పాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రోడ్లకు నిధులిచ్చింది లేదు.. విదిలిచ్చింది లేదంటూ ఎద్దేవ చేసారు. సిగ్నల్ ఫ్రీ సహచర మంత్రి కేటీఆర్ చొరవతోటే…