తెలంగాణకు దళితున్ని సీఎం చేస్తా అని ఈ దరిద్రుడు సీఎం అయ్యాడంటూ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు టీపీసీస చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… అర శాతం ఉన్నోల్లు అంతా క్యాబినెట్ లో ఉన్నారని, 16 శాతం ఉన్న దళితులు కేబినెట్‌లో ఎక్కడ లేరని ఆయన మండిపడ్డారు. మందకృష్ణ 24 ఏండ్లుగా ఉద్యమం చేస్తున్నాడని, 12 ఏండ్లు చేసి నువ్వేదో గొప్ప చెప్పుకుంటున్నావ్.. మరీ మందకృష్ణమాదిగ ఏం చెప్పాలి.. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటి మరి ? అంటూ ఆయన ప్రశ్నించారు. సీఐకి కేసీఆర్ కుటుంబంకి ఎంతో సన్నిహితుడని, రాడిసన్ పబ్ వివరాలు అన్ని సీఐ దగ్గరే ఉన్నాయన్నారు. దాంట్లో యువరాజు చిట్టా అంతా ఉందని, ఈ కేసులో నన్ను ఇరికిస్తే… నిన్ను పబ్ కేసులో ఇరికిస్త అని బెదిరిస్తున్నారు అంటా.. పోలీస్ అత్యాచారం చేస్తే పట్టుకోలేక పోతుందా ఈ వ్యవస్థ.. కేసు తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోంది.
Mother Sold Son : కొడుకును అమ్మేసి.. కిడ్నాప్ చేశారంటూ డ్రామా..
ఆ అమ్మాయి మీద వ్యభిచారం కేసు పెట్టే ఆలోచన చేస్తుంది. భర్త మీద బ్లాక్ మెయిల్ కేసు పెట్టాలని చూస్తున్నారు. విమలక్కపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు పెట్టే దైర్యం కూడా చేయలేదు. తెలంగాణ వచ్చాక విమలక్క మీద కేసులు పెట్టారు. విమలక్క పాటల మీద ఉద్యమం చేసి.. ఆమెనే అణచివేశారు. తెలంగాణ ప్రజల అవేదన అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చినా అధికారం రాదని ఆంధ్ర నాయకులు అన్నారు. వాళ్ళ మాటలు నిజం చేయడం కాదు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ కి విజ్ఞత చూపించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కి అధికారం ఇవ్వండని ఆయన కోరారు.