విశాఖ శ్రీ శారదాపీఠంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు స్వరూపానందేంద్ర. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్ళుగా దేశం ఇబ్బందులు పడిందన్నారు స్వరూపానందేంద్ర. ఈ ఏడాది చతుర్ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. దీనివల్ల దేశానికి ఇబ్బందులు తప్పవు అన్నారు స్వరూపానందేంద్ర. ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంతవరకు ఇబ్బందులు తొలగుతాయి. ఉత్తరాదిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు స్వరూపానందేంద్ర. దేశమంతటా వాహన ప్రమాదాలు అధికమవుతాయి. ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయన్నారు స్వరూపానందేంద్ర. జూలై నుండి సెప్టెంబరు వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయి. విదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయన్నారు స్వరూపానందేంద్ర.
Read Also: Jharkhand: శ్రీరామ నవమి ఊరేగింపుపై నిషేధం.. తాలిబాన్ పాలనలో ఉన్నామా అంటూ బీజేపీ ఆందోళన
ఇటు అరసవల్లి క్షేత్రంలో ఉగాది వేడుకలు , వేదపండితుల పంచాంగ శ్రవణం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠాకర్ ఉగాది పచ్చడి సేవించారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ఆదిత్యుని మాడ్యువల్ ను ఆవిష్కరించారు కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి వసంత నవరాత్రోత్సవాలు.. పదిరోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు జరుగుతాయి. తొలిరోజు మల్లెపూలు,మరువంతో అమ్మవారికి పుష్పార్చన..పుష్పార్చనలో పాల్గొన్నారు ఆలయ వేద పండితులు,భక్తులు. అమ్మవారిని దర్శించుకున్నారు డిప్యూటీ సిఎం రాజన్న దొర, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
Read Also: COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?