Today Events April 09, 2023
* నేడు బిజెపి పార్లమెంటరీ బోర్డ్ సమావేశం..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టి అభ్యర్థులను ఫైనల్ చేయనున్న పార్లమెంటరీ బోర్డు..ఇప్పటికే కర్ణాటక ముఖ్యనేతలతో భేటీ అయిన నడ్డా, అమిత్ షా.. రేపు బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన.నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీశ్ రావు
*నేడు జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన… కమ్మర్ పల్లి మండలం కోన సముందర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న మంత్రి
* ఇవాళ ఐపీఎల్ల్ లో రెండు మ్యాచ్ లు.. ఇవాళ మధ్యాహ్నం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్.. రాత్రి 7.30 పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్
* నంద్యాల బేతంచెర్లలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శేషవాహన సేవ
* నేడు తిరుపతి నుండి హైదరాబాద్‌కు బయలుదేరనున్న వందేభారత్ రైలు..మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నుండి పయనం..నిన్న హైదరాబాద్ నుండి రాత్రి 10.30కి గంటలకు తిరుపతికి చేరుకున్న వందేభారత్.. తిరుపతిలో ఘనస్వాగతం పలికిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, బిజెపి నేతలు
*నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం… పూలంగి సేవ
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి …అళ్వార్ ట్యాంక్ వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు
*బందీపూర్, ముదుమలై టైగర్ రిజర్వ్‌లకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఈరోజు మైసూరులో ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఈవెంట్‌లో ఆయన తాజా పులుల గణన డేటాను విడుదల చేయనున్న మోడీ
*నేటి నుంచి లోవ తలుపులమ్మ అమ్మ వారి పుట్టింటి సంబరాలు..గంధామావాస్య పర్వదినం సందర్భంగా 12 రోజులు పాటు జరగనున్న జాతర
*అన్నవరం దేవస్థానంలో వివాహాలు చేసుకునే వారికి వివాహ రిజిస్ట్రేషన్లు జారీ నిలిపివేసినట్లు ప్రకటించిన అధికారులు..న్యాయపరమైన ఇబ్బందులు దేవస్థానం ఇచ్చే సర్టిఫికెట్ కు చట్టబద్ధత లేకపోవడంతో ఈ నిర్ణయం
*నేటితో ముగియనున్న ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు…రాత్రికి పుష్ప యాగంతో ఉత్సవాలు పూర్తి.