Off The Record: కంచుకోటలో అభ్యర్థులు కరువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోసం వెదుకుతోందట కాంగ్రెస్ పార్టీ. ఒకప్పటి కంచుకోటలో ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదట. ఏ అసెంబ్లీ నియోజకవర్గం అది? ఎందుకంత దారుణమైన పరిస్థితి వచ్చింది?
నర్సాపూర్‌లో విలవిల్లాడుతున్న కాంగ్రెస్
మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. బలమైన కేడర్ కూడా ఉండేది. ఆ పార్టీ తరపున సునీతా లక్ష్మారెడ్డి మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీన్ రివర్స్ అయింది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారామె. దీంతో హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు సునీతా లక్ష్మారెడ్డి.
Also Read
నర్సాపూర్‌లో ఎమ్మెల్యే స్థాయి నేత దొరకని కాంగ్రెస్
సునీత బీఆర్ఎస్లోకి వెళ్ళాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు కరవైంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఒక్కరూ దొరకలేదట ఆ పార్టీకి. ఇప్పటికీ వెదుకుతూనే ఉన్నారట కానీ… ఇంకా సరైన అభ్యర్థి కనిపించలేదట. ఎన్నికల టైం సంవత్సరాలు గడిచి… నెలల్లోకి వచ్చింది. అయినా… కేడర్ మొత్తాన్ని దారిలో పెట్టి నేనున్నానని భరోసా కల్పించగలిగే నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్‌కు దొరకలేదట. దీంతో చివరి నిమిషంలో ఎవరో ఒకర్ని తీసుకువచ్చి మా మీద రుద్ది… వాళ్ళ కోసం పనిచేయమంటారేమోనని ఆందోళన చెందుతున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. ఇక నర్సాపూర్ మీద ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న నైరాశ్యంలో ఉన్నారట.
నర్సాపూర్ మీద పక్క నియోజకవర్గాల నేతల కన్ను?
నర్సాపూర్ కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులకు కొదవలేదు. కానీ…ఎమ్మెల్యే స్థాయి ఉన్నవారు మాత్రం లేరట. అందుకే…పక్క నియోజకవర్గాలకు చెందిన కొందరు నేతలు ఈ మధ్య రాకపోకలు పెంచారట. వాళ్ళ కదలికలు ఇక్కడి కేడర్‌కు రుచించడం లేదట. అందుకే తమలో ఒకర్ని ముందుకు తెచ్చే యోచనలో ఉన్నారట నర్సాపూర్ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు. త్వరలోనే ఒకర్ని అధిష్టానానికి చూపించి స్టాంప్ వేయించుకోవాలనుకుంటున్నారట. ఇతనే మీ నాయకుడు అని అగ్ర నాయకత్వం ఒక మాట చెప్పేస్తే.. తమ పని తాము చేసుకోవాలనుకుంటున్నారట నాయకులు. కాదు.. కూడదని పక్క నియోజకవర్గాలకు చెందిన వారిని ఇంపోర్ట్ చేస్తే.. మాత్రం సహాయ నిరాకరణ ఆలోచన కూడా ఉందట.
వాస్తవానికి నర్సాపూర్‌లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కంచుకోటల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికీ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నా…వాళ్ళని ముందుకు నడిపే నాయకుడు లేకపోవడమే అసలు విషాదం. ఉయ్ వాంట్ లీడర్ అంటోందట ఇక్కడి కాంగ్రెస్ కేడర్.
తాజావార్తలు
-
Govt Banks: ఆ 4 బ్యాంకులకు ఆర్థిక శాఖ షాక్.. గడువు పొడిగింపుపై ఉత్కంఠ..
-
Huawei Pura 90 Plus: Huawei Pura 90 Plus లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 50MP కెమెరాలతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్!
-
India vs Pakistan at UN: ‘పాకిస్థాన్ మాకు నీతులు చెప్పొద్దు’.. ఐరాసలో మైనారిటీల హక్కులపై భారత్ ఘాటు వ్యాఖ్యలు
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
Harry Brook: డబుల్ సెంచరీ చేసినా ఏం లాభం.. చాలా బాధగా ఉంది!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!