సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని మండిపడ్డారు. వికలాంగుల ఫించను మరో వెయ్యి పెంచుతున్నామని సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రకటించారు.
అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్‌వారిపై పోరాడి విజయం సాధించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికైనా విశ్వజనీనమని ఆయన అన్నారు. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు.
ఇవాళ నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నిజామాబాద్ లోని సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. నేటి నుంచి నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనం అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిసాలకు నిజామాబాద్ బయలుదే�