CM KCR Speech In Christmas Celebrations In LB Nagar Stadium: కొత్త యుద్ధానికి సమరశంఖం పూరించామని, ఒక మంచి కోసం జరిగే ప్రయత్నంలో అందరం భాగస్వామ్యం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేక్ కట్ చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. కులం, జాతి, వర్గం అని లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇది దేశానికే ఆదర్శమని అన్నారు. జై తెలంగాణ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, జై భారత్ నినాదంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే గొప్ప దేశంగా, శాంతికాముఖ దేశంతో భారతదేశాన్ని తీర్చిదిద్దుకుందామని తెలిపారు. అంతకుముందు.. దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన క్రైస్తవ పెద్దలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Minister Roja: మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు.. హీరోల కంటే జగనన్నే యంగ్
క్రీస్తు సూచనలు పాటిస్తే.. ఇతరుల పట్ల అసుయ, ద్వేషం ఉండదన్నారు. యుద్ధాలు ఉండవని, జైలుకు వెళ్లాల్సిన అవసరమూ ఉండదని చెప్పారు. తుది శ్వాస విడిచే వరకు వసుదైక కుటుంబంగా ఉండాలని కాంక్షించిన వ్యక్తి జీసస్ అని తెలిపారు. క్రీస్తు తర్వాత అనేక మంది స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం ప్రయత్నం చేశారన్నారు. ఆయన మార్గంలో పయనిద్దామని, విజయం సాధించాలని కోరుకుందామని కాంక్షించారు. కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రిస్టియన్ మత పెద్దలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం దిక్కులేని స్థితిలో.. చిన్న బుచ్చుకొని కూర్చున్న స్థితిలో జై తెలంగాణ అంటూ ఉద్యమం ప్రారంభించామని, తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని.. ఎన్నో విషయాల్లో పురోగతి సాధించి, నేడు దేశంలోనే కొన్నింటిలో అగ్రస్థానంలో, మరికొన్నింటిలో ద్వితీయ స్థానంలో ఉన్నామని కేసీఆర్ ఉద్ఘాటించారు.
Vishwa Hindu Parishad: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి