CM KCR Fires On BJP In Khammam BRS Public Meeting: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతు బంధుతో పాటు ఉచిత కరెంటు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కష్టాలు, కన్నీళ్ల నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందని, సహజ వనరులు ప్రజలకు దక్కేలా చూడటమే ఈ పార్టీ లక్ష్యమని తెలిపారు. మోడీ హయాంలో తెలంగాణలో తప్ప దేశమంతటా కరెంటు కోతలే ఉన్నాయన్నారు. అసలు దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని.. లక్షల కోట్ల సంపద ఏమైపోయిందో తెలియడం లేదన్నారు. నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి.. కేంద్రం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. స్వాతంత్య్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఈ నీటి యుద్దాలు ఎందుకని ప్రశ్నించారు. దశాబ్దాల క్రితం కట్టిన ప్రాజెక్టులు తప్ప కొత్తవి మళ్లీ కట్టలేదని, ఏళ్లు గడుస్తున్నా నీటి వివాదాలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
D Raja: బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి.. దేశాన్ని నాశనం చేస్తున్నాయి
కానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మిషన్ భగీరథ తరహాలో ఐదేళ్లలో ఇంటింటికీ మంచి నీళ్లు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రష్యా, ఘనా, కెనడా, ఈజిప్ట్, చైనా, అమెరికా వంటి దేశాల్లో నీటి సమస్యలు రాకుండా ప్రాజెక్టులు నిర్మించుకున్నాయని.. సువిశాల దేశమైన మన భారత్‌లో ఒక్క ప్రాజెక్టు కూడా వద్దా? అని నిలదీశారు. ప్రశ్నించడానికి, చైతన్యం తేవడానికే బీఆర్ఎస్ పుట్టిందని.. కచ్ఛితంగా తెలంగాణ ఉద్యమం తరహాలో భారతదేశంలో ఉద్యమం తెచ్చేందుకు పోరాటం చేస్తామన్నారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉంటే.. ఎన్నడూ 2.10 లక్షల మెగావాట్లకు మించి వాడలేదన్నారు. తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు. రేపు బీఆర్‌ఎస్ ప్రతిపాదించే ప్రభుత్వం వస్తే.. దేశమంతా తెలంగాణ మోడల్ మాదిరిగా ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రైతుబంధు లాంటి స్కీమ్ అమలు చేస్తామన్నారు. అదే బీఆర్ఎస్ నినాదమని స్పష్టం చేశారు.
Kajol Devgan: భర్త లేనప్పుడు అతడితో కాజోల్ లిప్ కిస్.. మరీ నాలుగుసార్లా..?
ఖమ్మం హెడ్ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలం లేకుంటే.. ప్రభుత్వమే భూమిని సేకరించి, జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. రాజకీయాలు జరుగుతుంటాయని, గెలుపోటములు సహజమని, కానీ భారత సమాజం లక్ష్యం ఏంటని ప్రశ్నించారు. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా.. దారి తప్పిందా.. అనేది అందరూ సీరియస్‌గా ఆలోచించాలన్నారు. సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అని, దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమౌతుందని ప్రశ్నించారు. దేశంలో సంపద ఉండి కూడా మనం యాచకులుగా మిగిలిపోయామన్నారు. అద్భుతమైన పంటలు పండే అవకాశం ఉన్నా.. ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వాల మెడలు వంచేలా పోరాటం జరగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Pakistan: పాకిస్తాన్‌కు షాక్ ఇవ్వనున్న అమెరికా.. నాటోయేతర మిత్రదేశ హోదా రద్దు.!
బీజేపీ పెట్టుబడిదారులు, దోపిడీదారుల ప్రభుత్వమని విమర్శించిన కేసీఆర్.. ఆ పార్టీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే తమ పాలసీ నేషనలైజేషన్ అని అన్నారు. మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్మే ప్రయత్నం చేస్తోందని.. దేశ ప్రజలకు పేగ బంధం ఉన్న ఎల్ఐసీని సైతం కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఒకవేళ కేంద్రం ఎల్ఐసీ, విశాఖ ఉక్కును అమ్మినా.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరెంటు రంగాన్ని పబ్లిక్ సెక్టార్‌లోనే ఉంచుతామన్నారు.
Bhagwant Mann Singh: బీజేపీ ఒక జుమ్లా పార్టీ.. లూటీతంత్రం నడిపిస్తోంది