ఇవాళ నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నిజామాబాద్ లోని సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. నేటి నుంచి నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనం అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిసాలకు నిజామాబాద్ బయలుదేరి, టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని అధ్యక్ష సీటులో కూర్చోబెట్టనున్నారు. ఈనేపథ్యంలో.. నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి, పూజల నిర్వహించిన అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డిని సీటులో కూర్చోపెట్టనున్నారు.
అయితే.. మంత్రి వర్గం, సీఎల్పీ సమావేశాలు తర్వాత పాల్గొంటున్న సభ కావడంతో.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. సీఎం రాకతో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిజామాబాద్ గులాబీమయంగా మారాయి. కాగా, అసెంబ్లీ, పార్టమెంటు ఎన్నికల తర్వాత గులాబీ దళపతి పాల్గొనబోయే బహిరంగ సభ ఇది. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం వచ్చేసింది. దీంతో రాజకీయ పార్టీల కార్యక్రమాలు ఊపందుకుంటున్న తరుణంలో నిర్వహిస్తున్న సభ కావటంతో.. పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల నుంచి లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రజలను తరలించే పనిలో పడ్డారు.
షెడ్యూల్ ఇదే:
మధ్యాహ్నం 2 గంటలకు హెలిక్యాప్టర్‌లో పోలీసు పరేడ్ మైదానం చేరుకుంటారు సీఎం, మధ్యాహ్నం 2:10: ఎల్లమ్మగుట్టలో టీఆర్ఎస్ జిల్లా నూతన కార్యాలయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:30 నిమిషాలకు కార్యాలయ భవనాన్ని ప్రారంభించి అనంతరం మధ్యాహ్నం 2:40 నిమిసాలకు: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి, మధ్యాహ్నం 3:05 నిమిషాలకు గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయనున్నారు సీఎం కేసీఆర్.
Astrology: సెప్టెంబర్5, సోమవారం దినఫలాలు