హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ విద్యా వంతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడంలో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చని ఆయన విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు. ఆనాడు…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ కలిసి రైతులను దగా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. ఇక, ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్షలు.. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్లైన్ పెట్టారు సీఎం కేసీఆర్.. 24 గంటల్లో వరి కొనుగోళ్లపై తేల్చకపోతే.. తామే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఇదే సమయంలో.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మీటింగ్ జరగనుంది. ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన యాసంగి వడ్ల కొనుగోళ్లపైనే కేబినెట్ లో ప్రధాన చర్చ జరగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచే యాసంగి వడ్లు మార్కెట్లకు రావడం మొదలైంది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినందున తాము కూడా యాసంగి వడ్లు…
చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను సేకరించి..మర పట్టించిన తరువాత తమకు అవసరం ఉన్నంత మేర ఉంచుకుని మిగతా బియ్యాన్ని కేంద్రానికి పంపిస్తున్నాయి. అలా రైతుల నుంచి రాష్ట్రాలు సేకరించిన మొత్తం ధాన్యానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో నిల్వ చేస్తుంది. ప్రస్తుతం మన దగ్గర వచ్చే మూడేళ్ల అవసరాలకు సరిపడ ధాన్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బియ్యం కొనుగోలు చేయడం…
రాష్ట్రంలో పట్టపగలు భూదోపిడీ చేసి కంపెనీలకు కట్టబెడుతున్నారు. పేదల భూమి లాక్కోవలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 111 జీవో ఎత్తివేస్తే ఐదింతల భూమి రేటు పెరిగే అవకాశం ఉంది. పట్టపగలు భూ దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న భూములు కేసీఆర్ కుటుంబ సభ్యులవే అన్నారు. https://ntvtelugu.com/revanth-reddy-ten-questions-to-cm-kcr/ ఈ భూములపై సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ తెచ్చి రాష్ట్రంలో పివి నరసింహారావు…
తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఇది విజయవంతం అయిందని ప్రకటించింది. ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో అక్కడి తెలంగాణ భవన్లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ భారీ నిరసన దీక్షలో పాల్పంచుకున్నారు. ‘ఒకే…
తెలంగాణ రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగాచేస్తున్నాయని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సీఎం కేసీఆర్వి వికృత చేష్టలు. క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో కేసీఆర్ ది దొంగ దీక్ష.. . రైతులను దగా చేసే కుట్ర అన్నారు. రంగస్థలం సినిమాలో జగపతి బాబు లెక్క… కేసీఆర్ తయారయ్యారన్నారు శ్రవణ్. బీజేపీ..టీఆర్ఎస్లు డ్రామాలు చేస్తున్నాయి. ఇద్దరూ ధర్నాలు చేస్తే… రైతులను ఆదుకునేది ఎవరు .? ఉప్పుడు బియ్యం ఇవ్వం అని చెప్పింది…
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ దీక్షలో జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? నరేంద్ర మోదీ ఎవరితోనైనా పెట్టుకో.. కానీ రైతులతో మాత్రం పెట్టుకోవద్దు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా…
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కేంద్రం నడుస్తోంది. తాజాగా ఢిల్లీలో రైతులకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంటే.. హైదరాబాద్ ఇందిరాపార్క్ లో బీజేపీ నేతలు కూడా దీక్షకు దిగారు. దీంతో మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. బీజేపీ మోడీ సర్కారు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు కేంద్రమంత్రి మురళీధరన్. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కనీస మద్దతు ధరలు పెంచింది. తెలంగాణ రైతులకు కేంద్రం ఏమీ చేయడం లేదని కేసీఆర్ అంటున్నారు. పీయూష్ గోయల్ ధాన్యం…