Ramzan: హోంమంత్రి నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramzan: రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు.హోంమంత్రి నివాసంలో సీఎం కేసీఆర్ రంజాన్ వేడుకల్లో పాల్గొని మంత్రి కుటుంబసభ్యులకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఆయనతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎంపీ కేశవరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రంజాన్ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్‌లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్, బన్సీలాల్‌పేట బోయగూడలోని క్యూబా మసీదు వద్ద ప్రార్థనలలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని.. మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీస్సులతో ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Read Also: Swiggy: రంజాన్ సీజన్‌లో బిర్యానీ కొత్త రికార్డు.. హలీమ్ వెనక్కి..! ఏ ఫుడ్ ఎలా అంటే..?
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
జిల్లా కేంద్రాల్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న పలువురు మంత్రులు.. అన్ని మతాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇటీవలే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనా మందిరాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ, మాసబ్ ట్యాంక్ హాకీ మైదానం, సికింద్రాబాద్, రాణిగంజ్, మిరాలం ఈద్గా, చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు తదితర చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రంజాన్ పండగ పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని వద్ద గల ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి నూతన వస్త్రాలు ధరించి ఈద్గాకు చేరుకుని ప్రార్ధనలు చేశారు.

తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!