యాస్ తుఫానుపై హోమ్ మంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు సీఎం జగన్. ఈ సందర్బంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని సీఎంకు వివరించారు అధికారులు. తుఫాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని..ముందు జాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం…
మాజీ ఎమ్మెల్యేలు కూనరవికుమార్, బిసి జనార్దన్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రజల్ని కరోనాకు బలిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారని సిఎం జగన్ కు చురకలు అంటించారు. “సహజీవనం చేసుకోండి అంటూ ప్రజల్ని కరోనాకి బలిస్తూ ప్రతిపక్ష నేతల పై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారు సిఎం జగన్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్…
యాస్ తుఫాన్ తీవ్రమవుతున్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వ, తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏపి ప్రభుత్వం. ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలకు సిద్దమైంది ప్రభుత్వం. యాస్ తుఫాన్ ప్రభావం ఏపి తో పాటు ఐదు రాష్ట్రాలపై వుంటుందని రాష్ట్ర ప్రభుత్వంను అలెర్ట్ చేసింది కేంద్రం. రూర్కెల, ఒడిషా నుండి 100 మిలియన్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఈనెల 24 లోగా సమీకరణ చేయనుంది. అంగుల్, కరీంనగర్, రూర్కెల నుండి కూడా రోడ్…
విశాఖలో బ్లాక్ ఫంగస్ వణుకుపుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సిఎం జగన్, సెక్రటరి. ఏకే సింఘాల్, ప్రభుత్వాధికారులకు లేఖ రాశారు తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. విశాఖ జిల్లా బ్లాక్ పంగస్ కేసులపై చర్యలు తీసుకోవాలని…బ్లాక్ పంగస్ కు కెజీహెచ్ లో బెడ్ కేటాయించడమే కాదు… మందులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మందులు లేవని భాధితులు చెప్తున్నారని…ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆసుపత్రులలో…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. డాక్టర్ సుధాకర్ నేపథ్యంలో చంద్రబాబుకు చురకలు అంటించారు. పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడని ఫైర్ అయ్యారు. “నీకెందుకు నేనున్నా రెచ్చిపో అంటాడు చంద్రబాబు. మీడియా ముందు పులి వేషాలెయ్యమంటాడు. పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు పొడుస్తాడు. ఆనాటి ఎన్టీఆర్ నుంచి డాక్టర్ సుధాకర్ వరకు అంతే. చంద్రబాబు లిస్టులో ఇంకెంతమంది ఉన్నారో?” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు…
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే కోవిడ్–19ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిఎం జగన్. ఏపీలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించామని…అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత…
ఏపీ సర్కార్ పై జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. దేశంలో పంపిణీ జరిగిన ప్రతి 7 వెంటిలేటర్లలో ఒకటి ఏపీకి దక్కిందని..రాష్ట్రంలో చాలా చోట్ల వెంటిలేటర్లను సరిగా ఉపయోగించడం లేదని సమాచారం ఉందన్నారు. “కరోనా” కేసుల్లో ఏపీ 5వ స్థానంలో, మరణాల్లో 9వ స్థానంలో ఉందని.. ఇంత దారుణ పరిస్థితి ఏపీలో ఎందుకు నెలకొంది? అని ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందని ఫైర్ అయ్యారు. ఏపీలో సరైన సంఖ్యలో టెస్టులు…
విశాఖ ఉక్కు దీక్ష నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నారా లోకేష్ స్పందించాడు. ట్విట్టర్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలు. విశాఖ ఉక్కు ని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని వైస్ జగన్ కుట్రలు చేస్తుంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు..ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ…
కోవిడ్ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరపున ఉచితంగా అందిస్తామని సీఎం వైయస్ జగన్‌కు నాట్కో ఫార్మా లిమిటెడ్ లేఖ రాసింది. కోవిడ్ –19 చికిత్సలో వాడే బారిసిటినిబ్–4 ఎంజీ (బారినట్) టాబ్లెట్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు లేఖలో పేర్కొంది నాట్కో ట్రస్టు. సుమారు లక్ష మంది కోవిడ్ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేయనున్నట్టు తెలిపింది నాట్కో ఫార్మా లిమిటెడ్. రూ.4 కోట్ల 20 లక్షలు మార్కెట్ ఖరీదు చేసే టాబ్లెట్స్‌ను ప్రభుత్వ ఆసుపత్రులు,…
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బిజేపి నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిలో అనేక మంది అధికార పార్టీ నేతలు హస్తం ఉందని..ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగులను రక్షించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విష్ణు వర్ధన్ రెడ్డిమండిపడ్డారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని..చేతల్లో చర్యలు లేవన్నారు. ప్రయివేటు ఆసుపత్రిలో ఎక్కడైనా 50 శాతం రోగులు చేర్చుకున్నట్లు ఏ ఒక్కరైనా ఆధారాలతో నిరూపించగలరా? రాష్ట్రంలో 514 ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించినట్లు చెబుతున్నారు.. కనీసం 10…