విశాఖలో బ్లాక్ ఫంగస్ వణుకుపుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సిఎం జగన్, సెక్రటరి. ఏకే సింఘాల్, ప్రభుత్వాధికారులకు లేఖ రాశారు తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. విశాఖ జిల్లా బ్లాక్ పంగస్ కేసులపై చర్యలు తీసుకోవాలని…బ్లాక్ పంగస్ కు కెజీహెచ్ లో బెడ్ కేటాయించడమే కాదు… మందులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మందులు లేవని భాధితులు చెప్తున్నారని…ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆసుపత్రులలో కూడా బ్లాక్ ఫంగస్ పై ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలని..ఇప్పటికే అనేక విషయాల్లో లేఖలు రాసిన ముఖ్యమంత్రి జగన్ నుండి ఎలాంటి స్పందన లేదని గుర్తు చేశారు వెలగపూడి.