కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం… పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ఉన్న ప్రాజెక్టు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నాం అన్నారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదు.…
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడిని అరికట్టేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్దంగా డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తే పది రెట్లు పెనాల్టీ విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి ఇదే తప్పిదానికి పాల్పడితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. అటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 50 లేదా అంతకు మించి పడకలున్న ఆస్పత్రులు తప్పని సరిగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు…
ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని పేర్కొంది ప్రభుత్వం. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం… ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందన్న పిటిషనర్ న్యాయవాది.. ఆనందయ్యతో ప్రైవేట్…
ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. పదో తరగతి పరీక్షలు ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాత నిర్వహించాలని.. అప్పటి వరకు వాయిదా వేయాలన్న పిటిషన్ పై ఇవాళ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ…
పోలవరం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద… గోదావరికి అడ్డుకట్ట వేయడం ఇంజనీరింగ్ అద్భుతం అంటున్నారు నిపుణులు. గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులు మొదలు కాగా.. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్నారు అధికారులు. అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి…
వైసీపీకి చెందిన దళిత కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హత్యాయత్నం చేశారు. అరాచకాలు చేస్తోన్న బీసీ జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది చంద్రబాబు పాలన కాదు జగన్ పాలన అనేది గుర్తుంచుకోవాలి. అరాచకం చేసిన బీసీ జనార్దన్ రెడ్డిని చంద్రబాబు వెనకేసుకు రావడం సబబా..? చంద్రబాబుకు చెంచాడు సిగ్గు లేదు.. చారెడు ఎగ్గు లేదు అని పేర్కొన్నారు. కోవిడ్ కష్ట కాలంలో చంద్రబాబు హైదరాబాదులో…
బ్లాక్ ఫంగస్ మందుల పై సీఎం జగన్ మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్ కు వాడే ఇంజక్షన్లు చాలా కొరతగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీటి కొరత ఉంది అని అన్నారు. ఒక్కో రోగికి వారానికి కనీసంగా 50 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి మనకు 3వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయి. మరో 2వేల ఇంజక్షన్లు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీకూడా సరిపోని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నాం. వీలైనంత మేర ఇంజక్షన్లు తెప్పించడానికి గట్టిగా…
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 15.5లక్షల మంది రైతులకు రూ. 1820.23 కోట్ల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని.. ఈ నెలలోనే రైతుల కోసం రైతు భరోసా కింద నేరుగా వారి ఖాతాల్లోకి 3,928 కోట్లు పంపామని.. ఇదే నెలలోనే 15.5 లక్షల మందికి రైతులకు మేలు జరిగేలా రూ.1820.33 కోట్లు ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ నెలలోనే…
ఖరీఫ్-2020లో నష్టపోయిన పంటలకు నేడు వైఎస్ఆర్ పంటల బీమా కింద సాయం అందించనుంది జగన్ సర్కార్. ఇందులో భాగంగా 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,820.23 కోట్లు జమ చేయనుంది ఏపీ సర్కార్. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిఎం కార్యాలయం నుంచి సిఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే యాస్ తుఫాన్ కారణంగా నేటి పంటల భీమా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ కు ఉత్తరాంధ్ర…
ఈరోజు క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ పై సమీక్ష చేపట్టనున్నారు సీఎం జగన్. ఇందులో ఆనందయ్య మందు పై జరుగుతున్న క్షేత్ర స్థాయి పరిశీలన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మూడు, నాలుగు రోజుల్లో నివేదిక వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు సీఎం. ఇక ఈ సమీక్షకు వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్, ఇతర…