కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బ్లాక్‌ఫంగస్ పై కీలక సమాచారాన్ని సిఎం జగన్ కు చేరవేశారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు 1179 ఉన్నాయని.. ఇందులో 1068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయ్యిందని తెలిపారు అధికారులు. బ్లాక్ ఫంగస్ వల్ల 14 మంది మృత్యువాత పడ్డారని.. కోవిడ్ లేకున్నా.. బ్లాక్ ఫంగస్ వస్తోందని సీఎంకు అధికారుల వెల్లడించారు. 40…
కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని ఈ సందర్బంగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉద్యోగాలకోసం వీసాలపై విదేశాలకు వెళ్లేవారికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే వారికి వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92…
దేశంలో పెట్రోల్ ధరలు మండి పోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. తాజాగా ఏపీలోనూ ఇదే పరిస్థితి. పెట్రోల్ ధరలు పెంచడంపై సిఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. దేశంలోనే లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ (వంద) దాటిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టి జగన్ రికార్డు సృష్టించాడని లోకేష్ ఫైర్ అయ్యారు. “IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో క్రిస్‌గేల్ సుడిగాలి సెంచరీ రికార్డుని IPL(ఇండియన్ పెట్రోల్…
మా ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏం చేస్తామో తూచ తప్పకుండా చేసిన పార్టీ వైసీపీ అని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మ్యానిఫెస్టోను పక్కాగా అమలుచేసిన రాజకీయ పార్టీగా దేశంలోనే ప్రఖ్యాతి పొందింది. చాలా మంది పథకాల పై అవగాహన లేకుండా హేళన చేస్తున్నారు. విద్య కోసం మేం పెడుతున్న పెట్టుబడి లాభాల కోసం కాదు. రాష్ట్రంలో నిరక్షరాస్యత తొలగించి … చక్కటి విద్యను అందించడమే మా లక్ష్యం. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను…
సీఎం జగన్ రెండేళ్ల పాలనపై జగన్ విధ్వంసం పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేసారు అచ్చెన్నాయుడు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చాక జేసీబి, ఏసీబీ, పీసీబీ, టాగ్ లైన్ సిఐడి అని చురకలు అంటించారు. సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు ఎవరైనా ఒక కార్యక్రమాన్ని మంచి పనితో మొదలు పెడతారు.. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం విధ్వంసంతో మొదలు పెడుతుందన్నారు. జేసీబీ-ప్రజా వేదికను కూల్చడంతో రాష్ట్రంలో జగన్ విధ్వంసం ప్రారంభించారని.. ఏసీబీ-జగన్ పరిపాలన…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు తెలిపారు. విశాఖలోని 1000 పడకల జంబో కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమున్న లక్షణమైన నాయకులు అని కొనియాడారు. మొదటి, రెండో దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పని చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి రెండో టర్మ్ రెండేళ్లు పూర్తి చేసుకుంటే..…
చంద్రబాబు, నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ బతికుండగా జగన్ ను ఓడించలేరని.. ఈ రెండేళ్ల పాలన చూసి 2014లో చంద్రబాబుకు ఓటు వేసి తప్పు చేశాం అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. దేశానికే జగన్ ఆదర్శ ముఖ్యమంత్రి అని..చంద్రబాబులా వెన్నుపోటుతో జగన్ రాజకీయాల్లోకి రాలేదని చురకలు అంటించారు. ప్రజలను నమ్ముకుని, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్ అని..చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయమన్నారు. గత…
సీఎం జగన్ మోహన్ రెడ్డికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ రాసారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ను 25 లక్షలకు పెంచాలి. ఆధారం కోసం కోవిడ్ పాజిటివ్ టెస్టునే కాకుండా, డెత్ సర్టిఫికెట్ ను కూడా అంగీకరించాలి . అనాధలుగా మారిన పిల్లలకు ఉపశమనం కోసం తక్షణమే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేషన్ వరకూ పిల్లల…
దేశంలో ప్రజల ఇబ్బందులకు ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని సిపిఐ రామకృష్ణ అన్నారు. కరోనా కంట్రోల్ చేసింది మోడీ వల్లే నంటూ గతంలో బిజెపి తీర్మానం చేసిందని..సెకండ్ వేవ్ లో వైఫల్యానికి మాత్రం మోడీ కారణం కాదంటారా ? అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలలో విజయమే ముఖ్యంగా మోడీ పని చేశారని..పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది సార్లు…
ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.భాస్కర్ ను కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యత ఇసస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టీడీసీ ఎం.డిగా బాధ్యతలు చూస్తున్న ప్రవీణ్ కుమార్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది ప్రభుత్వం. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి ఎస్. సత్యనారాయణకు ఏపీటీడీసీ…