బడ్జెట్ నేపథ్యంలో నిన్న ఏపీ అసెంబ్లీ ఒకరోజు సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో బడ్జెట్ తో సహ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అయితే దీనిపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. సిఎం జగన్ ఒక్కసారి హామీ ఇస్తే.. కచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాడని విజయసాయిరెడ్డి కొనియాడారు. “హామీ ఇస్తే నిలబెట్టుకోవడం జగన్ గారి సహజ గుణం – సహజ శైలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా…
ఏపీలో కోవిడ్ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని… ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్‌లు ఇవన్నీ కూడా నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలని అధికారులకు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు సిఎం జగన్. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని..ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులు, రెమ్‌డెసివర్ బ్లాక్ మార్కెట్ కఠిన…
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని..ఎదిగే కొద్ది ఒదగాలి అనేది తన విధానం.. మనమంతా ప్రజలకు సేవకులమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మేవరకు తోడుగా నిలబడుతున్నామని.. ఆర్బీకేల ద్వారా కల్తీ లేని విత్తనాలు, మందులు, ఇన్ పుట్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని..కుట్రలు చేసి పంచాయతీలపై ఆకుపచ్చ, నీలం రంగులను తుడిచివేయించగలిగారని టిడిపి కి చురకలు అంటించారు. జనం గుండెల్లో ఉన్న…
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ వేదికగా ఎంపి రఘురామకృష్ణరాజుపై ఎమ్యెల్యే జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు అయితే.. ఉపాధ్యక్షుడు రఘురామ కృష్ణరాజు అని ఆయని ఫైర్ అయ్యారు. వైసీపీ పార్టీ గుర్తు, సిఎం జగన్ ఫోటోతో రఘురామకృష్ణరాజు గెలిచారని గుర్తు చేశారు. ఆయన ఎంపి పదవీకి రాజీనామా…
నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. అయితే.. రూ. 2.25 -రూ. 2.30 లక్షల కోట్ల మధ్యలో 2021-22 వార్షిక బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేయనుంది ఏపీ సర్కార్. సామాజిక పెన్షన్ను రూ. 2500కు పెంచనున్న ప్రభుత్వం……
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీ 2021-22ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం ఉన్న 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 700 మెట్రిక్ టన్నులకు పెంచటమే ఉద్దేశ్యంగా ఈ పాలసీని ప్రారంభించారు. రాష్ట్రంలో 50 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పాలసీ రూపుదిద్దుకుంటోంది. ముందుకు వచ్చే ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. పెట్టుబడిలో 30 శాతం వరకు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అలాగే విద్యుత్ యూనిట్ కు…
ఏపీ ప్రభుత్వం ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా కష్ట కాలంలో బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాములా మారింది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాల అంచనాలను రూపొందిస్తోంది ఆర్ధిక శాఖ. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయిన ఏపీ…గత ఏడాది సుమారు 1.82 లక్షల…
రెండేళ్లపాలన కూడా పూర్తికాకముందే వరుసగా మూడో ఏడాది మత్స్యకార భరోసా అమలు చేస్తున్నాం అని సీఎం జగన్ తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా సామాన్యుడికి ఉన్న కష్టం పెద్దది. నేరుగా వారి అక్కౌంట్లోకి సుమారు రూ.120 కోట్లు పంపుతున్నాం. ఒకవైపు కోవిడ్, మరోవైపు వేట నిషేధ సమయంలో ఈ 1.2 లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున సహాయం వారికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10వేల…
ఎంపి రఘురామకృష్ణంరాజు అరెస్టు వివాదం ఇప్పుడు పూర్తిగా సుప్రీం కోర్టు చేతుల్లోకి వెళ్లిపోవడం వూహించిన పరిణామమే. ఆయనను ఎపి సిఐడి పోలీసులు దర్యాప్తు సందర్భంలో కొట్టారో లేదో తేల్చడానికి సికిందరాబాదులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని అత్యున్నత న్యాయస్తానం ఆదేశించింది. తాను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయనను అక్కడే కొనసాగించాలని కూడా స్పష్టం చేసింది. ఈ వైద్య పరీక్షల ఖర్చు ఎంపినే భరించాలని కూడా చెప్పడం కొసమెరుపు. ఏమైనా ఇప్పుడు అరెస్టును మించి ఆయనను కొట్టారా లేదా అన్నది…
ఎంపి రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ. రఘురామరాజు ఒక మానసిక రోగి అని…ఆయనకు ముందు మానసిక వైద్యం చేయించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఎం.పీగా గెలిచిన తర్వాత నరసాపురం నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని..దమ్ముంటే ఎం.పీ పదవికి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎవరి ప్రోద్భలంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలవాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ గారిని, పార్టీ పెద్దలను,…