మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా…
సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు. గిరిజనులకు పథకాలు దూరం చేసే అడ్డగోలు నింబధనలు తొలగించాలని లేఖలో పేర్కొన్నారు నారా లోకేశ్. గిరిజనులకు నిలిపివేసిన పెన్షన్, రేషన్‌ను పునుద్దరించాలని కోరారు. 10 ఎకరాల భూమి, వాహనం ఉంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఈ నిబంధనలు ఆదివాసీల పాలిట శాపంగా మారాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఏడాది ఆదాయం 25 వేలు కూడా ఉండదన్నారు. గిరిజనులకు పథకాలను…
ఏపీలో ఓటీఎస్‌పై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వన్ టైం సెటిల్‌మెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకంపై మీడియా పేరుతో కొన్ని సంస్థలు టెర్రరిజం చేస్తున్నాయంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని, ఈ పథకం వల్ల పేదలకు జరిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వం కనీసం వడ్డీ…
ఆంధ్రప్రదేశ్‌లోని జీవోనెం.29కు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. వార్డు, మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమిస్తు రాష్ర్ట ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే జీవో నెం.59ను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. డ్రెస్ కోడ్‌ను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో విచారణణు మరో వారానికి వాయిదా వేసింది. ఇప్పటికే…
టీడీపీ నేత పట్టాభిరామ్ మరోసారి సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పట్టాభి.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరో మోసమని ఆయన అన్నారు. పేదల ఙల్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారన్నారు. ఇప్పుడు లేఅవుట్ల నుంచి అదనంగా వెయ్యి…
ఏపీలో వరి వార్ మొదలైంది. తెలంగాణలో వరి వేయవద్దంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. ఏపీలో కూడా వరి వేయవద్దంటూ అధికారి వైసీపీ నేతలు చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. జగన్ చర్యలతో వ్యవసాయం కుదేలైందని, సీఎం జగన్ ఏపీలో వరిపంటకు ఉరివేశాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.…
ఏపీలో వచ్చిన వరద నష్టాన్ని పరిశీలించేందుకు ఒక్క కేంద్ర మంత్రి రాలేదని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. రాయలసీమలో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్ పర్యటనను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలకు అండగానిలవలేదని ఆయన మండిపడ్డారు.…
ఉద్యమ కార్యాచరణకు సిద్ధం చేసే సమయంలో నేను మాట్లాడిన మాటలను కొందరూ తప్పుగా అన్వయించారని, ప్రభుత్వాన్ని గద్దె దించుతామని నేను అనలేదని ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నేను అనని మాటలను అన్నట్టుగా ట్రోల్ చేసి ఉద్యమం పక్కదారి పట్టించేందుకు కొన్ని మాధ్యమాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశంలో మాటలను బయట పెట్టి రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని బండి శ్రీనివాస్ అన్నారు.…
ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం నిర్భంద వసూళ్లకు పాల్పడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ …వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. అధికారులకు టార్గెట్ ఇచ్చి అక్రమంగా ఓటీఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా ముఖంగా నిరూపించడానికి బహిరంగ చర్చకు నేను సిద్ధం.. మంత్రి బొత్స అబద్ధాలడుతున్నారని, ముఖ్యమంత్రికి జగన్‌నే సవాల్ చేస్తున్నాని ఆయన అన్నారు. నిరూపించపోతే మేము రాజీనామా చేస్తాం.. నిరూపిస్తే…
జగన్ సర్కార్ పై సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన ఇదే సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు..? అని నిలదీశారు. పోలవరం కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుంటే కేంద్రానికి అప్పగించాలని సవాల్ విసిరారు. పోలవరం నిమిత్తం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లు ఇచ్చామని… మరో…