ఎప్పటినుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీపై ఏపీ సీఎస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు పీఆర్సీతో పాటు తమ న్యాయమైన 71 డిమాండ్లను కూడా పరిశీలించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం సీఎస్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థంగా ఉందని ఆయన లోక్ సభలో ప్రస్తావించారు. ఏపీలో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యోగులకు కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఆదాయం సృష్టించే మార్గాలను మరిచి రుణాలపైనే ఆధారపడుతోందని ఆయన…
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పేదల మెడకు ఉరితాడులా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉచిత రిజిస్ట్రేషన్‌లు కోరుతూ ఈ నెల 20, 23న నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కక్ష సాధింపు కోసమే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌పై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రేమచంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్‌లో చెల్లింపులు జరిగాయని ఆయన అన్నారు. ఏపీలో రైతులు ఆందోళన చెందుతున్నారని రైతుల…
నిత్యం ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే సీపీఎం నేత మధుకి చేదు అనుభవం ఎదురైంది. రాయలసీమ ప్రజా సంఘాల నేతల ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. అయితే, మధు ప్రసంగానికి అడ్డు తగిలారు రాయలసీమ ప్రజా సంఘాల నాయకులు. అమరావతి రైతులకు మద్దతు ఇస్తూ రాయలసీమ ఉద్యమానికి ఎలా మద్దతు పలుకుతారంటూ మధుని ప్రశ్నించారు రాయల సీమ ప్రజా సంఘాల ప్రతినిధులు. ఈ నేపథ్యంలో మధుతో వాగ్వాదానికి దిగారు సీమ ప్రజా సంఘాల నాయకులు. దీంతో…
స్వంత పార్టీకి చెందిన నేతపైనే అదే పార్టీకి చెందిన మహిళా నేత పంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి ప్రెస్ మీట్ పెట్టారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు లీలావతి. నా భర్త కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక సర్పంచ్ ప్రదీప్ కుమార్. గతంలో నాపై ,నా భర్తపై కేసులు పెట్టి వేధించారు. నా భర్తకు ఎమ్మెల్యే జోగిరమేష్ కొంతమంది వ్యక్తులు చేత…
కోవిడ్, వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరిలోగా అందరికీ డబుల్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే కోవిడ్ నివారణలో ఉన్న పరిష్కారమని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయం అందరికీ అవాగాహన కల్పించాలని… గ్రామ సచివాలయాల్లో సంబంధించిన హోర్డింగ్స్ పెట్టాలని వెల్లడించారు. విలేజ్…
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను రాష్ర్టహైకోర్టు కొట్టివేసింది. జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. తల్లుల ఖాతాలో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. రాష్ర్ట ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తు హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు పిటిషన్ వేయగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.…
✍ నేడు ఏపీ హైకోర్టు అదనపు భవనానికి శంకుస్థాపన… హాజరుకానున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా✍ కర్నూలు: నేడు డోన్ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం… వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష… హాజరుకానున్న మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు.. వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం✍ నేడు తమిళనాడు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్… శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్……
ఏపీలో వైసీపీ పాలనపై నటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో జగన్ పాలన అద్భుతంగా ఉందన్నారు. ఏపీలో అన్ని వర్గాలకు సీఎం జగన్ సమన్యాయం చేస్తున్నారని అలీ కొనియాడారు. టాలీవుడ్‌కు సమస్యగా మారిన ఆన్ లైన్ టిక్కెట్ల విధానం, బెనిఫిట్ షోల వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అలీ పేర్కొన్నారు. దీనిపై జగన్ సానుకూలంగానే ఉన్నారని భావిస్తున్నట్లు అలీ తెలిపారు. Read Also: ఏపీలో…