అందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయండి : సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోర్టులు, ఎయిర్‌పోర్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణ పనుల పురోగతి పై సీఎంకు అధికారులు వివరాలందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి, కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు జిల్లాలో 6 విమానాశ్రయాలు నిర్వహణలో ఉన్నాయి. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెఫ్ట్ అని, వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎయిర్‌పోర్టు ఉండాలని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండని, అన్ని జిల్లాల్లో ఒకే రకంగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి పెట్టాలని, బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండని, విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. అందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయందాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయండని, నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రద్దీకి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు.
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న పోర్టులు, ఫిషింగ్ హార్భర్‌ల పనుల ప్రగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ అన్నారు. పనులు వేగవంతం చేయాలని జగన్ సూచించారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. 9 ఫిషింగ్ హార్భర్లలో తొలిదశలో నిర్మాణం చేపడుతున్న 4 ఫిషింగ్ హార్బర్లను అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. తొలిదశలో ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, జువ్వలదిన్నె జిల్లాల్లో ఫిషింగ్ హార్భర్ల నిర్మాణం చేస్తుండగా, రెండో విడతలో మిగిలిన 5 హార్భర్ల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాలపరిమితిలోగా నిర్మిస్తామని సీఎం జగన్ కు అధికారులు వివరించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!