RK.Roja: మంత్రి రోజాకు సొంత పార్టీ నుంచే అసమ్మతి.. ఓడిస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి రోజాకు (RK.Roja) సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మళ్లీ రోజాకు ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిస్తామని వైసీపీ అధిష్టానానికి రోజా వ్యతిరేక వర్గం నేతలు హెచ్చరించారు. తిరుపతిలో వ్యతిరేక వర్గం మీడియా సమావేశం నిర్వహించారు.
వడమాల పేట వైసీపీ జెడ్పిటీసీ మురళి ధర్ రెడ్డి, పుత్తూరు నేతలు, శ్రీశైలం ఆలయ చైర్మన్ తమ్ముడు, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు కూడా రోజా, అమె సోదరులు లాగా దోచుకోలేదన్నారు. రోజాను గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలన్నారు. వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో సచివాలయం, పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవానికి జనాలు లేకపోవడంతో ఓపెన్ చేయకుండా రోజా తిరిగి వెళ్లిపోయారన్నారు. టీడీపీ అభ్యర్ధి భాను ప్రకాష్‌ను గెలిపించాలనే ఉద్దేశంతోనే నగరి వైసీపీ నేతలు రోజాకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారన్నారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
రోజాకు కాకుండా సీటు ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామన్నారు. రోజా తమకు పదవులు ఇవ్వడమేంటి? మాకు పదవులు ఇచ్చింది వైపీపీ పార్టీ అని తెలిపారు. తామంతా కష్టపడి పనిచేయడం వల్లే రోజా గెలిచిందన్నారు. రోజా ఒత్తిడితో అధికారులు, పోలీసులు వచ్చి బలవంతంగా శిలాఫలకాలను ఎత్తికెళ్లారని వ్యతిరేక వర్గం నేతలు ఆరోపించారు.
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!