రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బూటకపు ప్రకటనలు చేయడాన్ని మంత్రి బుగ్గన కట్టిపెట్టాలన్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. మంత్రి బుగ్గన ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు..?ఓ రోజు కరోనా కారణంగా ఆదాయం తగ్గిందంటారు.. మరో రోజు కరోనా ఉన్నా ఆదాయం పెంచామంటారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత..? పెడుతున్న ఖర్చెంత..?మూలధన వ్యయం ఎక్కువగానే ఖర్చు పెట్టామని లెక్కలు చెబుతున్న బుగ్గన.. ఏ ప్రాజెక్టు ఎంతెంత ఖర్చు పెట్టారో చెప్పగలరా..?మరోసారి మాయలెక్కలను సభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్దమవుతోంది.సీఎం డ్యాష్ బోర్డులో ప్రభుత్వ ఆదాయ, ఖర్చుల వివరాలను పెట్టగలరా..?
రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏం రాలేదు. ఉన్న వ్యాపారాలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతుండడంతో జీఎస్టీ కూడా తగ్గిపోతోంది.చాణక్యుడి కూడా బెంబేలెత్తేలా బుగ్గన లెక్కలు వేస్తున్నారు.ఆర్థిక శాఖ పనితీరు అద్భుతంగా ఉంటే ఉద్యోగులు కోరుకుంటున్న విధంగా పీఆర్సీని ఎందుకు ప్రకటించలేదు..?రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్థం చేస్తూ.. మరో తరం పాటు కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బిఎంకు రెండు రెట్లు ఎక్కువగా వాడారు.. నేను వాస్తవాలు బయట పెడతా అన్నారు పయ్యావుల.