ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని, ఈరోజు, రేపటి లోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రెండు రోజుల విద్యుత్ కోతలపై టీడీపీ నానా గోల చేస్తుంది. టీడీపీ హయాంలో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలు మాకు అప్పజెప్పి వెళ్లారు.
అన్నీ సమస్యలు పరిష్కరించాం, రెండు రోజుల్లో ఏ సమస్య లేకుండా చేస్తాం. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేసిన సత్యసాయి జిల్లాపై బాలకృష్ణ అంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తండ్రి ఎన్టీఆర్ పేరిట కూడా ఓ జిల్లాను ప్రకటించాం.. టీడీపీ హయాంలో అది కూడా చేసుకోలేక పోయారు.
ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు మారటం సహజం. ఇవాళ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటున్న చంద్రబాబు ఏ రోజైనా కేంద్రానికి ఓ లేఖ రాశారా? అన్నారు మంత్రి బాలినేని. మానసిక పరిస్దితి సరిగా లేని సుబ్బారావు గుప్తా విషయంలో స్పందించాలంటే సిగ్గుగా ఉంది. సుబ్బారావు గుప్తా వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అన్నీ తెలుసు. తుని ఘటనలో అక్రమంగా ఆరోజున నమోదు చేసిన కేసులు ఎత్తివేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలన్నారు.