2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని నేడు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగన్ బటన్‌నొక్కి నేరుగా 5.17 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.534.77 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద…
కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం జిల్లాలోనే అత్యంత పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు నిర్వహించే జాతరకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే ‘ప్రభలు’…
రాష్ట్రంలో అధిక వడ్డీల భారి నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్నతోడు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న తోడు’ మూడో దశను ప్రారంభిస్తారని పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 14 వరకు 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 6,91,530 మంది లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందారని, మూడో దశలో…
నేటి నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్లో జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. రోజుకు 15 వేల చొప్పున టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. మరోసారి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం నేడు ఇన్‌పుట్ సబ్సిడీని అందజేయనుంది. ఈ రోజు రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ జమ చేయనున్నారు. ఏపీలో నేటి నుంచి జెన్‌కో సంస్థల్లో ఉద్యోగుల సహాయ నిరాకరణ చేయనున్నారు.…
విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని మంత్రుల బృందం సోమవారం సందర్శించింది. మంత్రులు పినిపే విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ లతో పాటు అధికారులు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రలు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిధులను గ్రీన్ ఛానల్ లో పెడతాం అని సీఎం హామీ ఇచ్చారని, 12.5 అడుగుల మోడల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. 25 అడుగుల నమూనా విగ్రహం త్వరలో పెడతామని,…
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇలా వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీలో రాజధానిపై కలకలం రేగింది. దీంతో ఎంతో మంది రైతులు, తదితరులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకుంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే…
వైసీపీ ఎమ్మెల్యేలకు పని పాటా లేకుండా ప్రతిపక్షాల మీద పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టించాలో ఆలోచించడమే పనిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా ఈ అభివృద్ధి పని చేశానని కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉందా…? వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుకీడ్చిందన్నారు అఖిల ప్రియ. ఒక్క అవకాశం అని చెప్పి ఓట్లు వేయించుకుని చుక్కలు చూపిస్తుంది. వైసీపీ ప్రభుత్వ పాలనపై…
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ జగన్ మత్స్యకారుల కష్టాలు గాలికొదిలేశారన్నారు. మత్స్యకార్ల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వం చేపలు అమ్ముకోవడం ఏమిటి? జీవో 217తో నాలుగున్నర లక్షల మంది మత్స్యకారుల ఉపాధి కోల్పోయే ప్రమాదం వుందన్నారు. మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి జనసేన లక్ష్యం. ఎన్నికల ముందు మత్స్యకార్లకు ఇచ్చిన హామీలు సీ.ఎం జగన్ ఎందుకు నెరవేర్చడం లేదని మనోహర్ ప్రశ్నించారు. కాకినాడ సూర్యారావుపేటలో జనసేన మత్స్యకార అభ్యున్నతి…
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షులు నాయకులు అచ్చెన్నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డకు మించి నటించారని ఆయన అన్నారు. జగన్‌రెడ్డికి మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం మరోసారి బహిర్గతమైందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. సీఎం,…