గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయం, గోశాలకు సీఎం జగన్ శుక్రవారం నాడు భూమిపూజ చేశారు. రూ.70 కోట్లతో శ్రీకృష్ణ ఆలయం, యువత కోసం యోగా ధ్యాన కేంద్రాలను ఇస్కాన్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన భూమిని కేటాయించింది. అనంతరం రూ.20 కోట్లతో ఇస్కాన్ అక్షయపాత్ర ఏర్పాటు చేసిన ఆధునిక కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ భోజనాన్ని అందించనుంది.…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో విద్యుత్ ధరలు పెంచి వాతలు పెట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు కోతలు కూడా మొదలు పెట్టిందని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కరెంట్ ఉండడం లేదని, ఇంకా వేసవి రాకముందే విద్యుత్ కోతలు మొదలైపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 26 వేల కోట్లకు పైగా అప్పులు.. ఛార్జీలు…
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా వుంటాయి. తాజాగా వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో సుదీర్ఘ ప్రస్తావన చేశారు. సలహా మండలిలో జిల్లా ఏర్పాటు లో అభ్యంతరాలు ప్రభుత్వానికి పంపాలన్నారు. ఆనం వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రాంకుమార్ రెడ్డి. విభజన వల్ల సోమశిల ప్రాజెక్టు నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు…
సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న జగన్.. మూడేళ్లు పూర్తి కాకుండా దేశమేం ఖర్మ, ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలకు నెంబర్ వన్ గా వున్న ఏపీని ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం,…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై వైసీపీ నేతలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. నెల్లూరును విడదీయవద్దని మేము ఎప్పుడో చెప్పామని, వైసీపీ నేతలు ఒక్కొరు ఒకో విధంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని కలిసే దమ్ము సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కానీ సంబరాలు చేసుకుంటున్నారని, కొందరు నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని…
ఏపీజెన్‌కో కోర్టు కేసును ఉపసంహరించుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల విద్యుత్తు సంస్థల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా వివాద పరిష్కారానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ఎస్ఆర్) కే రామకృష్ణారావు కేంద్రానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఏ సవరణపైనా తెలంగాణ కూడా వర్గీకరించింది. ఇది ఏడున్నర సంవత్సరాల తర్వాత పన్నుల విషయాలపై ఉన్న క్రమరాహిత్యాలను తొలగించడం కోసం ఇది అంతులేని వ్యాజ్యాలకు దారి తీస్తుంది. ఇప్పటికే పరిష్కరించబడిన విషయాలను మరింత క్లిష్టతరం…
నేడు గుంటూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించనున్నారు జగన్. అనంతరం 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ చేస్తారు సీఎం జగన్. ఇస్కాన్ (బెంగళూరు)కు చెందిన హరేకృష్ణ మూమెంట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మాణం జరగనుంది. ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ది చేసేలా ఇస్కాన్…
నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఫోకస్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించునున్నారు. నేడు 12 నియోజకవర్గాల ఇంచార్జీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. 3…
ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఏపీలో ఈరోజు 51 ప్రాజెక్టులకు ముందడుగు పడుతోందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఈరోజు మైలురాయి లాంటి రోజన్నారు. ఏపీలో జాతీయ రహదారులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ.10,400 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని జగన్ చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి…
నేడు విజయవాడలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్ర గడ్కరీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. నాయ్ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించనున్నారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజలు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించి, ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ, జగన్‌లు పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం…