Jagan Cabinet Berth: జగన్ ఫ్రేమ్‌లో పట్టేదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని ముఖ్యమంత్రి స్పష్టంగా తేల్చి చెప్పేయటంతో బెర్త్ కోసం కొందరు, ఎర్త్ పడకుండా మరి కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కోర్ట్ టీమ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
కేబినెట్‌లో కొందరు ఇళ్లకు
వైసీపీలో మంత్రి పోస్ట్ కోసం లాబీయింగ్ పతాకస్థాయికి చేరింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే పదవీకాలం రెండున్నర ఏళ్లు అని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చేప్పేశారు. మంత్రివర్గాన్ని దాదాపుగా పునర్వ్యస్థీకరించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు. అధినేత చెప్పిన సమయం రానే వచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్నవాళ్లలో కొందరు ఇంటికి వెళ్లక తప్పదు.
Also Read
కోర్‌టీమ్ సభ్యుల గుడ్‌లుక్స్ కోసం తాపత్రయం
కొన్ని సమీకరణల వల్ల ఒకరిద్దరికి మినహాయింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పటంతో మరింత ఉత్కంఠ పెరుగుతుంది. ఆ మినహాయింపులో కేబినెట్ బెర్త్‌ను కాపాడుకునేందుకు కొందరు మంత్రులు ప్రయాసలు పడుతున్నట్టు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి కోర్ టీమ్ సభ్యుల గుడ్‌లుక్స్ కోసం తెగ శ్రమిస్తున్నారట. వీరితోపాటు కొత్తగా మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కోర్ టీమ్ సభ్యుల ఆఫీసులకు క్యూ కడుతున్నారు.
సీఎం దృష్టిలో పడేందుకు కొత్త పంథాలు
ఉగాది నాటికి జిల్లాల విభజన అధికారికంగా జరగనుండటంతో మంత్రివర్గ కూర్పులో ఆ సమీకరణాలు కూడా కీలంగా మారబోతున్నాయి. ఈ తూకంలో నిలిచేది ఎవరు.. గెలిచేది ఎవరు అన్నదే ప్రశ్న. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఏదో రకంగా సీఎం దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు.. మంచి మార్కులు కొట్టి పదవి పదిలం చేసుకునేందుకు కొందరు మంత్రులు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అమాత్యులు తమను కేబినెట్‌లో కొనసాగించాలని పార్టీ ముఖ్య నేతలను నేరుగానే అడిగేస్తున్నారట.
విన్నపాలు వర్కవుట్ అవుతాయా?
ప్రస్తుతం ఈ విజ్ఞప్తులు.. ఎమ్మెల్యేల ఫీట్లు పార్టీలో చర్చగా మారాయి. ఎమ్మెల్యేలు ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా వీటిపైనే చర్చ. మరి.. అధికారపార్టీలో ఈ విన్నపాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో.. ఎవరి ఆశలను నెరవేరతాయో చూడాలి. సీఎం జగన్ ఫ్రేమ్‌లో పట్టేదెవరో కూడా వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!