ఏపీ సీఎం జగన్ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు. సీఎం అయిన తరువాత జగన్ లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగానే పరిమితమైంది. అయితే ఇప్పుడు సీఎం హోదాలో జగన్ దావోస్ వెళ్లనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను…
ఏపీలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల ఉన్నత, సాంకేతిక విద్య, న్యాయ విభాగం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మత్స్య శాఖ, యువజన సర్వీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, హోం, ప్లానింగ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ విభాగాలలోని కాంట్రాక్ట్…
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,300 మందికి, పరోక్షంగా 1,150 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే…
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో మంత్రి హోదాలో శాప్‌పై మంత్రి రోజా తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే శాప్ సమావేశంలో రోజా సెల్‌ఫోన్స్ గురించి ప్రస్తావించిన సమయంలో.. ఆమె సెల్‌ఫోన్ చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. కాగా మంత్రి రోజా సెల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తి ఎవరన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా శాప్ సమీక్ష సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర…
ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సీఎం కాన్వాయ్ కోసమంటూ తిరుమల వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఆపి వాహనాన్ని తీసుకెళ్లిన ఉదంతంపై చర్యలు చేపట్టారు. వాహనాలను ఆపిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి వినుకొండ నుంచి తిరుమల వెళ్తున్న ఓ కుటుంబం టిఫిన్ కోసం ఒంగోలులో ఆగింది. అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ సీఎం జగన్ పర్యటనకు కాన్వాయ్ కావాలంటూ వాహనాన్ని,…
అమరావతి సచివాలయంలో నూతన వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైలుపై మొదటి సంతకం చేశారు. అంతేకాకుండా 3500 ట్రాక్టర్లను వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 43 వేల…
సీఎం జగన్‌తో మంత్రి కాకాని భేటీ ముగిసింది. బయటకొచ్చి మరోసారి క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లిపోయారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అనంతరం కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ అనిల్ కు నాకు మధ్య ఎక్కడా విభేదాలు లేవు. మేం ఎక్కడా పోటా పోటీ సభలు ఎక్కడా నిర్వహించలేదు. పోటా పోటీ సభలనేవి మీడియా సృష్టే అని కొట్టిపారేశారు. ప్రస్తుతం నిప్పు లేకుండానే పొగ వస్తుంది. నెల్లూరులో అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. నీడనిచ్చే చెట్టు నీడను…