విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులను మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఎయిర్ పోర్టులో నేరుగా ఈ విషయాన్ని అవంతి, ధర్మశ్రీకి జగన్ చెప్పారు. ఇటీవల కేబినెట్‌లో స్థానం లభిస్తుందని ధర్మశ్రీ, రెండోసారి అవకాశం లభిస్తుందని అవంతి శ్రీనివాస్ భావించారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో వారిద్దరి సేవలను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్…
నేడు ఏపీ సీఎం జగన్ విశాఖ వెళ్లనున్నారు. విశాఖలో ఆయమన హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటల పర్యటన కోసం సీఎం జగన్ విశాఖకు వెళ్తున్నారు. ఉ.11:10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన అక్కడ సుమారు గంటల పాటు జిల్లా నాయకులతో భేటీ కానున్నారు. అనంతరం రుషికొండలోని పెమా వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్లి అక్కడ నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న హర్యానా సీఎంను కలవనున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు జగన్ తాడేపల్లికి…
ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభం?గుంటూరు జిల్లాకు చెందిన సన్నకారు రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలి. తనకున్న 1.64 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను తప్పుగా నమోదు చేయడమే కాకుండా.. తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్ల పాటు తిప్పుకోవడం దారుణం అన్నారు పవన్. Read Also: CM Jagan: గృహనిర్మాణ శాఖపై కీలక సమీక్ష రెవెన్యూ వ్యవస్థ తీరుతో…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు హయాంలో ప్రాధాన్యత ఉన్న కీలక పనులేవీ చేయలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. వైసీపీ ప్రభుత్వం కీలకమైన పనులే టేకప్ చేశాం. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పని చేశాం అన్నారు అంబటి. ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు.. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6…
కడప రిమ్స్ లో ప్రతీది వివాదమే అవుతోంది. తాజాగా రిమ్స్ డెంటల్ కాలేజిలో ప్రిన్సిపల్ ఛాంబరుకు సీల్ వేయడం, దాన్ని ఇవాళ పగులగొట్టడంతో పరిపాలనా పరంగా ఉన్న విభేదాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ముఖ్యమైన డాక్యుమెంట్లు కోసమే ఇలా సీల్ వేశామని చెబుతున్నారు. కడప రిమ్స్ దంత వైద్యశాల ఇన్చార్జిగా డాక్టర్ సురేఖ రెండు రోజుల క్రిందట బాధ్యతలు తీసుకున్నారు. అయితే డాక్టర్ యుగంధర్ ను ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా నియమిస్తూ ఉత్తర్వులు కూడా…
ఏపీలో మూడురాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఇంతకుముందే ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇంతవరకు హైదరాబాద్‌లో కొనసాగిన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలను ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు. తాజాగా కర్నూలు సంతోష్ నగర్ లో లోకాయుక్త నూతన కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు.…
రెండున్నరేళ్ళ తర్వాత కేబినెట్ మారుస్తానని చెప్సిన జగన్ గ్రేస్ పీరియడ్ పెంచి మరో ఆరునెలల తర్వాత కేబినెట్ మార్చారు. అందులోనూ సగం మందిని వుంచేశారు. ఏపీలో కేబినెట్ కూర్పు పూర్తైంది.. శాఖల కేటాయింపు కంప్లీట్ అయింది. చాలా మంది మంత్రులు తమకు అప్పగించిన శాఖలకు సంబంధించి బాధ్యతలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. తమకు అప్పగించిన శాఖలు నచ్చక..…
ఏపీ ప్రజలకు జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం తన వైఖరి వెల్లడిస్తూనే వుంది. పోలవరం ప్రాజెక్టు 2013 -14 లో అంచనాలకు మేము అంగీకారం తెలిపాం. ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది.. పెరిగిన అంచనాలపై ఒక కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు కేంద్ర జల శక్తి, సహాయ మంత్రి.. ప్రహ్లాద్ సింగ్ పటేల్. దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ కి అరవై వేల కోట్లు కేటాయించాం. ఈ మిషన్లో 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రం…
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీకేసులో నెల్లూరు జిల్లాఎస్పీ చెప్పింది వింటే కాకమ్మకథలే సిగ్గుపడతాయేమో అన్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని మించిపోయేలా జిల్లా ఎస్పీ విజయారావు కట్టు కథలు అల్లారు. కోర్టు ప్రాంగణంలో ఏం ఇనుము ఉందని దొంగలు అక్కడికి వెళ్లారు. కోర్టులోని రికార్డు రూములో ఇనుము దాచి ఉంచితే, దాన్ని దొంగిలించడానికి ఇనుము దొంగలు వెళ్లారా ఎస్పీగారు! కోర్టులోని రికార్డు రూములోని పత్రాలతో ఇనుము దొంగిలించే వ్యక్తలకు…