కర్నూలు నగరంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. కర్నూలులో దేవాదాయ శాఖ కార్యాలయాలకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన, మంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. పెరిగిన ధరలపై చంద్రబాబు అనసర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి గానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనసర రాజకీయం చేస్తూ ప్రజల మెప్పుకోసం ప్రజల్లోకి రావాని చూస్తున్నారని అన్నారు.
సీఎం జగన్ లబ్దిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే చంద్రబాబు సంపాందించిన లక్ష కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుందని, ప్రశ్నించడం మానేశారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ పై టాక్స్ పెంచలేదని, కేంద్ర ప్రభుత్వం పెంచితేనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వయసు మీదపడి చంద్రబాబు ఏం చేయాలో తెలియక ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు , జగన్ పాలనపై కాకుండా.. కేంద్రాన్ని ప్రశ్నిస్తే బాగుంటుందని. ఆ దమ్ము మీకుందా అన్నారు కొట్టు సత్యనారాయణ.