మోడీ ప్రభుత్వం విధానాలు ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదాలాంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. విద్యుత్ బిల్లులు బొగ్గు దిగుమతులు చేసుకోవడంపై రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్ర బలం అవసరం ఉంది… ఇప్పుడైనా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కేంద్రం నుండి సాధించుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వ పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం ఉన్నా జగన్ కేంద్ర ప్రభుత్వానికి బానిసలా మారాడని, గతంలో ఎన్టీ రామారావు ఫెడరల్ స్ఫూర్తికి నిలువుటద్దంలా వ్యవహరించారన్నారు.