ఏపీలో ఒకవైపు ట్వీట్ల యుద్ధం నడుస్తుంటే… మరోవైపు ఫేక్ ట్వీట్ల రగడ రాజకుంటోంది.ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో ట్వీట్‌లు వైరల్ అయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై ఆయన స్పందించారు. తన పేరుతో నకిలీ ట్వీట్ సృష్టించి ప్రచారంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమా. అలాంటి ట్వీట్లు తాను ఎలా పెడతానని ఉమా ప్రశ్నించారు. ఈ…
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లు, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభించారు జగన్. రైతులకు పంపిణీ చేసే ట్రాక్టర్ ను స్వయంగా నడిపారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించేందుకు వై.ఎస్.ఆర్. యంత్రసేవా పథకం ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. వరి ఎక్కువగా పండించే ప్రాంతాలలో కంబైన్డ్ హార్వెస్టర్ లు అందుబాటులోకి తెస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి రైతు…
ఏపీ సీఎం జగన్ గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటించనున్నారు.వైయస్సార్ యంత్ర సేవా పథకం – ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా పంపిణీ చేపట్టనున్నారు. గుంటూరులో రాష్ట్రస్ధాయి మెగా పంపిణీని జెండా ఊపి ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటి వరకు 6,781 ఆర్బీకే, 391 క్లస్టర్ స్ధాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు యంత్ర పరికరాల పంపిణీ జరిగింది. రూ. 691 కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేసింది జగన్ సర్కార్.…
1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలిన జరుగనుంది. అయితే ఇప్పటికే వైసీపీ, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లను వేయగా.. టీడీపీ మాత్రం పోటీకి దూరంగా ఉంది. 2. నేడు సాయంత్రానికి ఏపీకీ నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరిత ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 3. నేడు రాజమండ్రిలో బీజేపీ గోదావరి గర్జన సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11.30 గంటలకు…
ఏపీలో త్వరలో మరో క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోగో, టీజర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం నివాసంలో సీఎం జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 6 నుంచి జూలై 17 వరకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ జరగనుంది.…
ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇప్పటిదాకా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక జగన్ చెంతకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై వైసీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు,…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీ ఫైలుపై ఆయన సంతకం చేశారు. ఈ క్రమంలో బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలతో రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. CM Jagan: రేపు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఉద్యోగుల…
ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం టూర్ షెడ్యూల్‌ను ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ ఉ.10:40 గంటలకు గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. డాక్టర్ వైయస్‌ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు…
మరోసారి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పాపం జగనుదేనని, పోలవరం విషయంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 2021 జూన్ కల్లా పోలవరం పనులు పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పేశారని, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదని, పోలవరానికి సంబంధించి కేంద్రం నిధులేమయ్యాయో జగన్ ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వ్యక్తి వెదిరె…