ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు.
ఆపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యి పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలంటూ కేంద్ర మంత్రిని కోరారు. అయితే నేడు ఢిల్లీలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది. నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు అమిత్‌షాతో జగన్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.