పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో “ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ (ఐఈఐడీ)” డ్రైవ్ జరుగుతోంది.
ఇవాళ్టి నుంచి జూలై 5వ తేదీ వరకూ 20 రోజుల పాటు పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టారు అధికారులు. పారిశ్రామిక పార్కుల్లో తుప్పలను తొలగించడం, పేర్లను సూచించే బోర్డుల ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటు, వరద కాల్వల నిర్వహణ చేపడతారు. దీంతో పాటు రహదారుల మరమ్మతులు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనుంది ఏపీఐఐసీ. హిందూపురంలోని అమ్మవారిపల్లిలో మొక్కలు నాటి ‘ఐఈఐడీ’ని ప్రారంభించనున్నారు ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి.
గుంటూరు జిల్లా ఆటోనగర్ లో పారిశుద్ధ్య పనులలో భాగస్వామ్యం కానున్న ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు స్థానిక నేతలు, పారిశ్రామిక వేత్తలు. ఇటీవలి కాలంలో ప్రమాదాలు జరుగుతున్న వేళ అధికారులు అప్రమత్తం అయ్యారు. పారిశ్రామిక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
Washington: వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు