చేనేత కుటుంబం బలవన్మరణానికి జగన్ రెడ్డిదే బాధ్యత అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే చేనేత కుటుంబం చనిపోయింది.. బీసీల ఆస్తులను కబ్జా చేసి ఇదేమని ప్రశ్నిస్తే బలి తీసుకుంటున్నారు ఆరోపించారు.
ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణంపై సందేహాలు కలిగిస్తోంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారు అని విమర్శలు గుప్పించారు. ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారు.
ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయని పేర్కొ్న్నారు. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ…
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు…
కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో కొందరు నేతలు తనను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నారని ఆరోపించారు. వాళ్ళు ఎంతెంత సంపాదించారో తన దగ్గర జాబితా ఉందన్నారు. ఈరోజు తనను వదిలి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాంటి నేతలను వైసీపీలో చేర్చుకుని తప్పు చేశానని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వైసీపీ నాయకులు కార్యక్రమాల్లో వాలంటీర్లు కనబడితే తమ వాట్సాప్ నెంబర్ కు సమాచారం పంపించమని ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ టీడీపీ నాయకులు ప్రారంభించారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. వాలంటీర్లు సాధారణ మనుషులు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్లను టీడీపీ, ఐటీడీపీ భయపెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అభం శుభం తెలియని వాలంటీర్లపై ఎమ్మెల్యే కాండిడేట్ ఆదిరెడ్డి వాసు కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
వంగవీటి రంగాను హత్య చేసింది టీడీపీనే.. మళ్ళీ వైసీపీకే ప్రజల మద్దతు..! బీజేపీ నేత వంగవీటి నరేంద్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డితో మాట్లాడి వైసీపీలో జగన్ సమక్షంలో చేరాను అని తెలిపారు. వైఎస్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాను…
ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ పదవుల్లో మెజార్టీ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినఘనత జగన్ దే అని తెలిపారు. జగన్ ను మరో రెండు సార్లు గెలిపించుకోవాల్సి ఉంది.. జగన్ ఓ సంఘ సంస్కర్త అంటూ ఎంపీ ఆర్. కృష్ణయ్య కొనియాడారు.
ఎన్నికలకు ముందు అమలకు సాధ్యం కానీ, హామీలు ఇచ్చి మోసం చేసే చంద్రబాబు కావాలా.. చెప్పిన వన్నీ చేసి చూపిన జగన్ కావాలో ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మెదరమెట్ల జరిగిన సిద్ధం సభను చూసి చిలకలూరిపేటలో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పిలిచినా.. సభ అట్టర్ ప్లాప్ అయింది అని ఆరోపించారు. సర్వేపల్లి నియోజవర్గానికి టీడీపీ అభ్యర్థిని నిలపలేకపోతున్నారు అని మంత్రి అన్నారు.
సిద్ధం మహా సభలను వైసీపీ ఇప్పటికే నిర్వహించింది అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. నాలుగు సభలలో ప్రజలు జగన్ కి నీరజనం పట్టారు.. జగన్ 99 శాతం హామీలను అమలు చేశారు.. నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు..