తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా మే 13న ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు వారి క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు వారి నియోజకవర్గ వర్గాలలో పెద్ద ఎత్తున మీటింగ్ లు ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారాలను ముందుకు సాగిస్తున్నారు. Also Read: Khammam Police: వింత శబ్దాలతో సైలెన్సర్లు…
ఇవాళ వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్సీఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో 81 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 18 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేశాము అని తెలిపారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు ఫ్యాన్ పార్టీలోకి భారీగా వస్తున్నారు. తాజాగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు చేరారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రీజినల్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బస్సు యాత్ర, మేనిఫెస్టోతో పాటు ఎన్నికల ప్రచారంపై కీలకంగా చర్చించనున్నారు.
కవితను కలిసేందుకు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు.. ఇవాళ కవితను కలిసేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ సామ్ లో అరెస్ట్ అయిన కవితను ఇవాళ ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కలిసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమయం కేటాయించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల…
వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని తెలిపాయి. ఇవాళ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రచారం ప్రారంభించేందుకు YCP రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.
ఏపీతో పాటు ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే? దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13న…
ఎన్నికల షెడ్యూల్ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. పోలింగే మిగిలిందని తెలిపారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే.. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని అన్నారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు…
లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు.
ప్రణీత్ రావు కేసులో ట్విస్ట్.. బయటపడ్డ ఫోన్ ఛాటింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావ్ ఫోన్ చాటింగ్ చిత్రాలు ఎన్ టివి చేతికి చిక్కాయి. ఎన్నికల ముందు ప్రణీతరావు కొంతమంది వ్యక్తుల ఫోన్లు టాప్ చేసినట్లు చాటింగ్ లో వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో ప్రణీత్ రావు టాపింగ్ కు పాల్పడ్డాడు. బీఆర్ఎస్ నేత…