రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మే 13తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలు అవుతుందని, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్ డి ఏ కూటమికి మద్ధత్తు పలకాలన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. వచ్చేది వుత్తరాయనం పండుగలు సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా…
కరెంట్ పునరుద్ధరణ.. ఉప్పల్ స్టేడియంలో యధావిధిగా హైదరాబాద్, చెన్నై మ్యాచ్! ఉప్పల్ స్టేడియంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించని కారణంగా.. విద్యుత్‌శాఖ అధికారులు గురువారం (ఏప్రిల్ 4) స్టేడియంలో కరెంట్ నిలిపివేశారు. కరెంట్ నిలిపివేయడంతో ఒక్కసారిగా స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. జనరేటర్ల సహాయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో అసలు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు చెలరేగాయి. ఏనుగు…
ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డి పాలెం దగ్గర క్యాంప్ లో జగన్ బస చేయనున్నారు. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లాలో నేతలతో ఆయన ప్రత్యేకించి మాట్లాడతారు. వారికి రానున్న ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో గెలుపు సాధించే దిశగా చేయాల్సిన ప్రయత్నాలపై దిశానిర్దేశం చేయనున్నారు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలకు క్యాంప్ సైట్ వద్దకు…
నేడు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విరామం. నేడు నెల్లూరులోని ముఖ్యనేతలతో జగన్ సమావేశం. నెల్లూరు చింతరెడ్డిపాలెం దగ్గర సీఎం జగన్ బస. తెలంగాణలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ల ముందు రైతు సత్యాగ్రహ దీక్షలు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో దీక్షలు. రూ.15వేల భరోసా, రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్. క్వింటాల్ వడ్లకు…
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజాగళంకు భారీ స్పందన వస్తోందని.. వచ్చే 39రోజుల్లో జోరు పెరగాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. బందిపోట్లు పడ్డారు.. వారందరికీ నాయకుడు జగన్ అంటూ విమర్శించారు.
నా ప్రత్యర్థి ఎవరో నాకు ఇప్పటికీ తెలియడం లేదు.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 5 గ్యారంటీలు కాదు ఐదు మోసాలు, ఐదు అబద్ధాలు అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా లాభ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం…
ప్రచారంలో మమత దూకుడు.. మహిళలతో కలిసి డ్యాన్స్ దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షులైతే.. తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల నుదిటకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె కొద్ది రోజులు చికిత్స తీసుకున్నారు. గాయం నుంచి కోలుకోవడంతో ప్రచారంలో స్పీడ్ అందుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో గాలి, వానతో పలు ప్రాంతాలు దెబ్బ…
మదనపల్లెలో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి.. పేదల భవిష్యత్తు కోస జరిగే యుద్ధంలో పాల్గొనడానికి అందరూ సిద్ధంగా ఉండండని తెలిపారు. ఇంటింటికి మంచి చేశాను.. 175కి 175, 25 ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు కూడా తగ్గకుండా ప్రజలందరూ గెలిపించాలని సీఎం జగన్ కోరారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చానని పేర్కొ్న్నారు.
కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తాం..! కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామని ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్ళే ఈ కుట్ర ఇవ్వాల్టిది కాదని, అసెంబ్లీ సమావేశంలోనే ఈ కుట్రకు బీజం పడిందన్నారు. మూడు నెలల క్రితమే ఈ కుట్రకు తెర లేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి భుజం పైనా…
సిటిజన్ ఫర్ డెమోక్రసీ.. టీడీపీ, బీజేపీల బినామీ చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బీనామి సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అని ఆయన ఆరోపించారు. ఈ సంస్థ అధ్యక్షుడు టీడీపీ హయాంలో పదవి అనుభవించారన్నారు. నిమ్మగడ్డ రమేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. ఒక…